Karnataka Politics: దేశ రాజకీయాల్లో మొన్నటి కర్నాటక ఎన్నికల ఫలితాలు అత్యంత ముఖ్యమైనవిగా చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నించగా బీజేపీ విఫలమైంది. హస్తం పార్టీకే కన్నడ ప్రజలు మొగ్గు చూపారు. అంతకుముందు బీజేపీ, కాంగ్రెస్ పోటీపోటీగా రాజకీయ ప్రచారాలు నిర్వహించారు. స్వయంగా పార్టీ అధినేతలే రంగంలోకి దిగారు. అయితే అక్కడి ప్రజలు మాత్రం కాంగ్రెస్ కే ఓటేసి అధికారంలోకి తీసుకువచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కర్నాటకలో సస్పెన్స్ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థిగా సీఎం పీఠం ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ ఉండేది. చివరకు హైకమాండ్ వరకు ఆ విషయం వెళ్లడంతో సస్పెన్స్ కు తెరతీసింది.
Read Also: Ntr : సొంతంగా నిర్మాణ సంస్థ మొదలు పెట్టబోతున్న ఎన్టీఆర్..?
ఇదిలా ఉంచితే.. కర్నాటకలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బస్వరాజ్ బొమ్మై దాడి తీవ్రతరం చేశారు. త్వరలోనే రాష్ట్ర ప్రజలు ఎమర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కొంటారని ఆయన కామెంట్స్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంపై జిల్లా స్థాయిలో బీజేపీ నాయకులు, ఎమ్మెల్యేలతో జరిగిన అంతర్మథన సమావేశం తర్వాత బొమ్మై ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బొమ్మై ఆరోపించారు. వారిని వ్యతిరేకించే ప్రతి గొంతును అణిచివేసేందుకు ప్రయత్నిస్తూ వాక్‌స్వేచ్ఛపై దాడి చేస్తున్నారు.. నేను చెబుతున్నాను.. ప్రజలు త్వరలో ఎమర్జెన్సీ వంటి పరిస్థితిని చూస్తారు’ అని బొమ్మై జోస్యం చెప్పారు.
Read Also: Bhatti vikramarka: పరిహారం అందలేదు.. మర్లపహడ్ తండావాసుల ఆవేదన
కర్నాటక ప్రజలు తమను ఆదుకునేందుకు, రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు.. బీజేపీ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా మౌనంగా ఉండలేం’ అని బొమ్మై స్పష్టం చేశారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి గురించి మీడియా ప్రశ్నించగా.. చాలా చోట్ల స్వల్ప ఓట్ల తేడాతోనే బీజేపీ అభ్యర్థులు ఓడిపోయారన్నారు. ‘ప్రజలతో టచ్‌లో ఉంటాం.. ఇక బెలగావి జిల్లా విషయానికొస్తే సహకార రంగం పార్టీని నీడలా వెంటాడింది’ అని మాజీ ముఖ్యమంత్రి బొమ్మై చెప్పుకొచ్చారు.