మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, Sony సెన్సర్‌తో కెమెరా సెటప్ తో Motorola Edge 70 Fusion భారత్‌లో లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Motorola Edge 70 Fusion Launch: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన ఎడ్జ్ సిరీస్‌ను మరింతగా పెంచుతూ.. మోటోరోలా (Motorola) భారత మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ (Motorola Edge 70 Fusion)ను అధికారికంగా లాంచ్ చేసింది. సరికొత్త డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీ, AI ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఇందులో క్వాడ్ కర్వ్ డిజైన్ ఇచ్చారు. ముందు గ్లాస్ వెనుక ప్యానెల్‌తో కలిసేలా ఉండటం వల్ల ఫోన్‌కు స్మూత్ లుక్ వస్తుంది.
India Playing XI: అభిషేక్ విషయంలో కోచ్, కెప్టెన్ సంచలన నిర్ణయం.. టీమిండియా తుది జట్టు ఫిక్స్!
Also Read
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్‌ప్లే
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
ఈ ఫోన్ ఫాంటోన్ బ్లూ సర్ఫ్, ఫాంటోన్ కంట్రీ ఎయిర్, ఫాంటోన్ సీల్ హౌట్టే అనే ప్రత్యేక రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ IP68+IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i డిస్‌ప్లే ప్రొటెక్షన్ కలిగి ఉంది. ఇంకా ఈ ఫోన్‌లో కొత్త కెమెరా సిస్టమ్‌ను అందించారు. ముఖ్యంగా సోనీ LYTIA 710 సెన్సర్ ఉన్న తొలి స్మార్ట్‌ఫోన్ లలో ఇది ఒకటి. ఇందులో 50MP మెయిన్ కెమెరా (OIS సపోర్ట్), 13MP అల్ట్రా వైడ్ + మాక్రో లెన్స్ (122° ఫీల్డ్ ఆఫ్ వ్యూ), 32MP ఫ్రంట్ కెమెరాలు ఉంటూ 4K వీడియో రికార్డింగ్ కు సపోర్ట్ చేస్తాయి. AI ఆధారిత మోటో ఏఐ & ఫోటో ఎన్‌హాన్స్‌మెంట్ ఇంజిన్ చిత్రాలను మరింత స్పష్టంగా చేయడంలో సహాయపడతాయి.

ఇంకా ఈ కొత్త మోటోరోలా మొబైల్ లో 6.78 అంగుళాల 1.5K ఎక్స్ట్రీమ్ OLED డిస్‌ప్లే ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 5200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, ఫాంటోన్ వాలిడేటెడ్ కలర్ అందిస్తుంది. ఆడియో కోసం స్టీరియో స్పీకర్లు, డాల్బీ ఆటమ్స్, Hi-Res ఆడియో సపోర్ట్ అందించారు. ఇంకా ఇందులో స్నాప్ డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇక ఇందులో 7000mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 52 గంటల వరకు పని చేస్తుంది. దీనికి 68W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
T20 World Cup 2026 Final: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. అభిమానుల కోసం ప్రత్యేక రైలు..!
ధరలు:
* 8GB + 128GB – రూ. 26,999
* 8GB + 256GB – రూ. 29,999
* 12GB + 256GB – రూ. 32,999
ఈ ఫోన్ మార్చి 12 నుంచి ఫ్లిప్కార్ట్, మోటోరోలా అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్‌గా రూ. 2,000 బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తున్నారు.

తాజావార్తలు
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?