అత్యంత సంపన్న భారతీయ టైటిల్ ను గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి ముఖేష్ అంబానీ సొంతం చేసుకున్నారు. బుధవారం విడుదల చేసిన 2023 హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ 82 బిలియన్ డాలర్ల సంపదతో అత్యంత సంపన్న భారతీయుడిగా నిలిచారు.
IPL: క్రికెట్ అభిమానులకు ముఖేష్ అంబానీ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌లను ఆయన ఉచితంగా ప్రసారం చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రపంచంలో అత్యధిక వ్యూవర్షిప్ కలిగిన ఐపీఎల్ మ్యాచ్‌ల డిజిటల్ ప్రసార హక్కులను ఈసారి ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలోని వయాకామ్18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ దక్కించున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ సంస్థ 2.7 బిలియన్ డాలర్లు చెల్లించింది.
Driver Salary: మామూలుగా.. కార్ డ్రైవర్ నెల జీతం ఎంతుంటుంది? మహాఅయితే 20 వేల రూపాయలుంటుందేమో. ఇంకా అయితే కొంత మంది వీవీఐపీలు 50 వేల వరకు ఇస్తారేమో. కానీ.. ఏకంగా 2 లక్షల రూపాయలు సమర్పించారంటే.. అది.. చాలా విశేషమే కదా?. అయితే.. దీనికే ఆశ్చర్యపోకండి. ఇది ఐదేళ్ల కిందట ఇచ్చిన శాలరీ. మరి.. ఇప్పుడు ఇంకెంత ఉంటుందో ఊహించుకోండి. ఇంతకీ.. ఈ రేంజ్లో జీతం ఇచ్చి.. అతడి జీవితాన్ని పావనం చేసిన ఆ గొప్ప…
Campa Cola: పాత రుచి కొత్త బాటిల్ తో రానుంది ఐకానిక్ డ్రింక్ క్యాంపాకోలా ఇండియాలోకి రీఎంట్రీ ఇవ్వనుంది. ఈ వేసవిలో ఇండియన్ మార్కెట్ లోకి రాబోతోంది. దాదాపుగా 50 ఏళ్ల క్రితం వరకు ఇండియాలో ఈ బ్రాండ్ చాలా ఫేమస్. 1970,80ల్లో ఇండియాలో చాలా ఫేమస్ అయిన ఈ బ్రాండ్ ను వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భారతదేశంలోకి తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం క్యాంపాకోలా లెమన్, ఆరెంజ్ రుచులతో రాబోతోంది. అదానీ గ్రూప్, యూనిలివర్,…
Ritesh Agarwal: దేశంలోనే అత్యంత తక్కువ ధరల్లో హాస్పిటాలిటీ చైన్ ను రన్ చేస్తున్న కంపెనీ ఓయో. దానిని స్థాపించింది.. కేవలం 29 ఏళ్ళ యువకుడు రితేష్ అగర్వాల్. రితేష్ అగర్వాల్ ఒడిషాలోని రాయగడకు చెందిన మర్వాడి కుటుంబంలో జన్మించాడు. ఆరోజుల్లో రితేష్ కుటుంబం ఇక్కడ చిన్న కిరాణ దుకాణం నిర్వహించేది.
Business Headlines 02-03-23: ఏపీలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్: ఆంధ్రప్రదేశ్‌లో రేపు, ఎల్లుండి 2 రోజులు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరగనుంది. శుక్రవారం, శనివారం నిర్వహిస్తున్న ఈ సదస్సుకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ ఓడరేవు ఆధారిత పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించటంపై దృష్టిపెట్టనున్నట్లు చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్ మరియు పునరుత్పాదక వనరుల నుంచి పంప్డ్ స్టోరేజ్ పద్ధతిలో పవర్ జనరేట్ చేసే ఇండస్ట్రీలు రాష్ట్రానికి రావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
టీవల ప్రముఖుల ఇళ్లను పేల్చేస్తామని, హోటల్లో బాంబు ఉందని భయపట్టే కాల్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, మెగాస్టార్స్ అమితాబ్ బచ్చన్, ధర్మేంద్రలకు చెందిన ముంబై బంగ్లాలను పేల్చివేస్తామని నాగ్‌పూర్‌లోని పోలీసు కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసి గుర్తు తెలియని వ్యక్తి బెదిరించాడు.
RIL Investments: రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వచ్చే నాలుగేళ్లలో ఉత్తరప్రదేశ్‌లో 75 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. తద్వారా కొత్తగా లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించనుంది. ఈ పెట్టుబడులు.. ఈ ఉద్యోగాలు.. టెలికం, రిటైల్ మరియు రెనివబుల్ బిజినెస్‌లలో అందుబాటులోకి రానున్నాయి. రిలయెన్స్ ఇప్పటికే యూపీలో 50 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. తద్వారా 80 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చింది.
Today (02-02-23) Business Headlines: అనలిస్టులను ఆశ్చర్యపరచిన ‘మెటా’: మెటా సంస్థ అంచనాలకు మించి మంచి త్రైమాసిక ఫలితాలను నమోదు చేయటం ద్వారా మార్కెట్ అనలిస్టులను ఆశ్చర్యపరచింది. 40 బిలియన్ డాలర్ల షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 32 పాయింట్ 7 బిలియన్ డాలర్ల రెవెన్యూ సాధించినట్లు వెల్లడించింది. గతేడాదితో పోల్చితే ఈ ఆదాయం నాలుగు శాతం తగ్గినట్లు తెలిపింది.