Business Headlines 02-03-23: ఏపీలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్: ఆంధ్రప్రదేశ్‌లో రేపు, ఎల్లుండి 2 రోజులు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరగనుంది. శుక్రవారం, శనివారం నిర్వహిస్తున్న ఈ సదస్సుకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఓడరేవు ఆధారిత పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించటంపై దృష్టిపెట్టనున్నట్లు చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్ మరియు పునరుత్పాదక వనరుల నుంచి పంప్డ్ స్టోరేజ్ పద్ధతిలో పవర్ జనరేట్ చేసే ఇండస్ట్రీలు రాష్ట్రానికి రావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
టీవల ప్రముఖుల ఇళ్లను పేల్చేస్తామని, హోటల్‌లో బాంబు ఉందని భయపట్టే కాల్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, మెగాస్టార్స్ అమితాబ్ బచ్చన్, ధర్మేంద్రలకు చెందిన ముంబై బంగ్లాలను పేల్చివేస్తామని నాగ్‌పూర్‌లోని పోలీసు కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసి గుర్తు తెలియని వ్యక్తి బెదిరించాడు.
RIL Investments: రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వచ్చే నాలుగేళ్లలో ఉత్తరప్రదేశ్‌లో 75 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. తద్వారా కొత్తగా లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించనుంది. ఈ పెట్టుబడులు.. ఈ ఉద్యోగాలు.. టెలికం, రిటైల్ మరియు రెనివబుల్ బిజినెస్‌లలో అందుబాటులోకి రానున్నాయి. రిలయెన్స్ ఇప్పటికే యూపీలో 50 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. తద్వారా 80 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చింది.
Today (02-02-23) Business Headlines: అనలిస్టులను ఆశ్చర్యపరచిన ‘మెటా’: మెటా సంస్థ అంచనాలకు మించి మంచి త్రైమాసిక ఫలితాలను నమోదు చేయటం ద్వారా మార్కెట్ అనలిస్టులను ఆశ్చర్యపరచింది. 40 బిలియన్ డాలర్ల షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 32 పాయింట్ 7 బిలియన్ డాలర్ల రెవెన్యూ సాధించినట్లు వెల్లడించింది. గతేడాదితో పోల్చితే ఈ ఆదాయం నాలుగు శాతం తగ్గినట్లు తెలిపింది.
పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌తో అనంత్ అంబానీ నిశ్చితార్థం జరిగిన సందర్భంగా అంబానీ కుటుంబం గురువారం ఒక డ్యాన్స్ షోను ఏర్పాటు చేసింది.
Today (20-01-23) Business Headlines: మైక్రోసాఫ్ట్ @ తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో మరో 3 డేటా కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు 16 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ ఆసియా ప్రెసిడెంట్ అహ్మద్ మజహరి వెల్లడించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు జరుగుతున్న సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ని కలిసి తమ నిర్ణయాన్ని తెలిపారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన చిన్నకొడుకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ముంబైలో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంట గురువారం అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారు.
Radhika Merchant: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడి వివాహ కార్యక్రమాలు మొదలయ్యాయి. ముఖేష్ అంబానీ-నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీతో రాధిక మర్చంట్ వివాహం జరగబోతోంది. మెహందీ వేడుకల్లో కాబోయే కోడలు రాధికా మర్చంట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
Exclusive Story on Ambani Companies: ఒక్కసారి ఊహించుకోండి. మనింట్లోని ప్రతి వస్తువూ ఒకే కంపెనీకి చెందినవైతే ఎలా ఉంటుందో?. ఒకే కంపెనీకి చెందినవి కాకపోయినా ఒకే వ్యక్తి నేతృత్వంలోని వివిధ సంస్థలకు చెందినవైనా అయితే ఎలా ఉంటుందో ఆలోచించండి. మనం తినే ఫుడ్డుతో మొదలుపెట్టి.. వేసుకునే బట్టలు.. ప్రయాణం చేసే కారులోని పెట్రోల్.. ఇంటర్నెట్.. గాడ్జెట్లు.. స్పోర్ట్స్ ఇలా ప్రతి ప్రొడక్టూ.. ప్రతి సర్వీసూ.. సింగిల్ పర్సన్ నడిపించే వ్యాపార సామ్రాజ్యం నుంచే వస్తున్నాయి.