Sharad Pawar Says Attacking Adani-Ambani Not Right: రాజకీయ ప్రయోజనాల కోసం ముఖేష్ అంబానీ, గౌతమ్ అదాని వంటి పారిశ్రామికవేత్తలపై దాడి చేయడం ఏమాత్రం సరైంది కాదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ పేర్కొన్నారు. ఒక న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు ప్రైవేట్ రంగాన్ని లక్ష్యంగా చేసుకునే సుదీర్ఘ చరిత్ర ఉందని, అయితే ఈ దృగ్విషయం మారాలని సూచించారు. ‘‘ప్రైవేట్ రంగాన్ని లక్ష్యం చేసుకోవడం అనేది మన దేశంలో చాలా ఏళ్లుగా జరుగుతోంది. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే, టాటా-బిర్లాకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లం. ఆ తర్వాత ఈ దేశానికి టాటా అందించిన సేవల గురించి తెలుసుకొని.. మేము ఇన్నాళ్లు టాటా-బిర్లా అంటూ వ్యతిరేక వ్యాఖ్యలు ఎందుకు చేశామని ఆశ్చర్యం వేసింది’’ అని తెలిపారు.
Japanese Military Helicopter: కుప్పకూలిన జపాన్ ఆర్మీ హెలికాప్టర్.. 10 మంది గల్లంతు
అయితే.. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరినో ఒకరిని టార్గెట్ చేయాలి కాబట్టి, తామంతా టాటా-బిర్లాని టార్గెట్ చేసేవాళ్లమని శరద్ పవర్ చెప్పారు. అయితే.. ఇప్పుడు టాటా-బిర్లా పేరు ముందంజలో లేదని, ఎంతోమంది టాటా-బిర్లాలు వచ్చారని అన్నారు. ఈరోజుల్లో ప్రభుత్వం మీద దాడి చేయాలంటే.. అదాని, అంబానీ పేర్లను తెరమీదకు తీసుకొస్తున్నారని ఆయన కుండబద్దలు కొట్టారు. ఒకవేళ మనం టార్గెట్ చేసిన వ్యక్తులు ఏదైనా తప్పు చేసి ఉంటే, అధికారాలను దుర్వినియోగం చేస్తే.. ప్రజాస్వామ్యంలో వారికి వ్యతిరేకంగా మాట్లాడే హక్కు 100 శాతం ఉందన్నారు. కానీ.. కారణాలేమీ లేకుండా ఆయా వ్యక్తుల్ని టార్గెట్ చేసి దాడి చేయడంలో, అర్థం లేదన్నారు. ‘‘ఈరోజు అంబానీ పెట్రో కెమికల్ రంగానికి ఎంతో తోడ్పడ్డారు. మరి, దేశానికి ఇది అవసరం లేదా? అలాగే.. విద్యుత్ రంగంలోనూ అదాని తనవంతు సహకారం అందించారు. మరి.. దేశానికి విద్యుత్ అవసరం లేదా?’’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. దేశం కోసం ఇలాంటి పారిశ్రామిక వేత్తలు బాధ్యతలు తీసుకొని, తమవంతు కృషి చేస్తున్నారని కొనియాడారు.
Drunk IndiGo Passenger: విమానంలో తాగుబోతు వీరంగం.. ఆ పని చేయబోయి అరెస్ట్
ఒకవేళ అదాని, అంబానీలు ఏదైనా తప్పు చేసి ఉంటే.. వారిపై దాడి చేయడంలో ఎలాంటి తప్పు లేదని శరద్ పవార్ అన్నారు. కానీ.. వాళ్లు దేశానికి కావాల్సిన మౌలిక సదుపాయాల్ని సృష్టించారని, వాళ్లని వారిని విమర్శించడం సరైనది కాదని తన భావన అని అభిప్రాయపడ్డారు. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) విచారణకు డిమాండ్ చేయడంపై.. తన మిత్రపక్షం కాంగ్రెస్ అభిప్రాయాలను పంచుకోలేదని స్పష్టం చేశారు. అదానీ గ్రూప్‌కు తనదైన మద్దతు ప్రకటించిన శరద్ పవార్.. బహుశా నాలుగైదు నెలల పాటు వివాదం సృష్టించడం కోసం, ఈ వ్యవహారాన్ని తెరమీదకి తెచ్చి ఉంటారని, కానీ నిజం ఎప్పటికీ బయటకు రాదని చెప్పుకొచ్చారు.