END of Ola and Uber?: హమ్మయ్య.. నగరాల్లో నరకం చూపే ఆటోవాళ్ల ఆగడాలను అరికట్టడానికి ఓలా, ఉబర్ వచ్చాయని జనం సంబరపడ్డారు. ప్రయాణం ఇంత సునాయాసమా అని సంతోషం వ్యక్తం చేశారు. ఇంటికే వచ్చి పికప్ చేసుకోవటం, సరిగ్గా ఎక్కడికి వెళ్లాలో అక్కడే డ్రాప్ చేయటం, ఛార్జీ బేరమాడే అవసరం లేకపోవటం, ఏసీ, ఎంటర్టైన్మెంట్ మరియు ఇతరత్రా సదుపాయాలు సైతం ఉండటంతో ప్యాసింజర్లు ఫుల్లు హ్యాపీగా ఫీలయ్యారు. కానీ.. ఆ ఆనందం మూణ్నాళ్ల ముచ్చటేనని ఆ…
చాలా మంది కుబేరులు ఎంత సంపాదించినా సమాజం కోసం ఎంతో కొంత ఖర్చు చేయాలని భావిస్తుంటారు. దేశంలో కొందరు ప్రముఖ వ్యక్తులు, వ్యాపారవేత్తలు తమ సహృదయాన్ని, దానగుణాన్ని చాటుకుంటున్నారు. దాతృత్వంలో నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ వరుసలో ముందు నిలిచారు ఐటీ టైకూన్ శివ్ నాడార్.
Airtel 5G: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ దేశంలోని 8 నగరాల్లో 5జీ ప్లస్ సేవలను ప్రారంభించింది. ఈ సేవలను పొందేందుకు సిమ్ కార్డు మార్చాల్సిన అవసరం లేదని, 5జీ ఫోన్ ఉంటే సరిపోతుందని ఎయిర్టెల్ వెల్లడించింది.
Death threat to Mukesh Ambani Family: రిలయన్స్ ఇండ్రస్ట్రీస్ అధినేత, మల్టీ బిలియనీర్ ముకేష్ అంబానీ కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు ఆగంతకులు. బుధవారం మధ్యాహ్నం, 12.57 నిమిషాలకు సర్ హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ ల్యాండ్ లైన్ నెంబర్ కు తెలియన నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆస్పత్రిని పేల్చేస్తామని హెచ్చరించారు. అంబానీ కుటుంబంలోని కొంతమందిని చంపేస్తామని బెదిరించారు.
Reliance Industries: ముంబైలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రిలయన్స్ కంపెనీల బాధ్యతలను వారసులకు అప్పగిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాదే నాయకత్వ బదలాయింపు ఉంటుందని ముఖేష్ అంబానీ ప్రకటించగా.. తాజాగా నాయకత్వ బదలాయింపు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ జియో ఛైర్మన్గా నియమితులయ్యాడు. అటు చిన్న కుమారుడు అనంత్ అంబానీకి రిలయన్స్ గ్రూప్ ఇంధన వ్యాపార బాధ్యతలను అప్పగించారు.…
Mukesh Ambani statement on Jio 5G: హైస్పీడ్ 5జీ స్పెక్ట్రం సర్వీసులను ఈ ఏడాది దీపావళి నాటికి అందుబాటులోకి తేనున్నట్లు రిలయెన్స్ జియో సంస్థ ప్రకటించింది. తొలుత ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు రిలయెన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ ఆన్లైన్లో జరిగిన సంస్థ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో ఆయన కంపెనీ షేర్ హోల్డర్లను ఉద్దేశించి ప్రసంగించారు.
ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దుబాయ్లో 80 మిలియన్ల డాలర్ల విలువ గల బీచ్-సైడ్ విల్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇది నగరంలోనే అతిపెద్ద నివాస ప్రాపర్టీ డీల్ అని ఒప్పందం గురించి తెలిసిన ఇద్దరు వ్యక్తులు తెలిపారు.