Forbes Billionaires List 2023: ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీ 9వ స్థానంలో ఉన్నారు. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ముఖేష్ అంబానీ కొనసాగుతున్నారు. గౌతమ్ అదానీ భారతదేశంలో రెండవ స్థానంలో, శివ నాడార్ మూడవ స్థానంలో ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ఫోర్బ్స్ 37వ వార్షిక ప్రపంచ బిలియనీర్ల జాబితా 2023లో 83.4 బిలియన్ డాలర్ల నికర విలువతో 9వ స్థానంలో నిలిచారు. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
ఆసియాలోనే అత్యంత ధనవంతుడు
90.7 బిలియన్ డాలర్ల నికర విలువతో అంబానీ గతేడాది ప్రతిష్టాత్మక జాబితాలో ప్రపంచంలో 10వ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది తాజా జాబితాలో మైక్రోసాఫ్ట్‌కు చెందిన స్టీవ్ బాల్మర్, గూగుల్ సహ-వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్.. ఫేస్‌బుక్ అధినేత జుకర్‌బర్గ్, డెల్ టెక్నాలజీస్ మైఖేల్ డెల్‌ల కంటే అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు.
Read Also: LIC’s Superhit Policy : 4ఏళ్లు డబ్బు డిపాజిట్ చేయండి.. రూ.కోటి సొంతం చేసుకోండి
రెండో స్థానంలో గౌతమ్ అదానీ
గౌతమ్ అదానీ భారతదేశంలో రెండవ ధనవంతుడు. అయితే ఇటీవల అదానీ గ్రూపు కంపెనీల షేర్ల ధరలు పతనం కావడంతో ప్రపంచవ్యాప్తంగా 24వ స్థానానికి దిగజారింది. అతని మొత్తం ఆస్తులు 47.2 బిలియన్ డాలర్లుగా అంచనా.
మూడో స్థానంలో శివ నాడార్
హెచ్‌సిఎల్ టెక్నాలజీస్‌కు చెందిన శివ్ నాడార్ నికర విలువ 25.6 బిలియన్ డాలర్లు కాగా.. ఆయన ప్రపంచ ర్యాంక్ 55వ స్థానంలో జాబితాలో భారతీయులలో మూడవ స్థానంలో ఉన్నారు.
Read Also: PAN-Aadhaar Correction : పాన్ ఆధార్లో తప్పులుంటే కొన్ని క్షణాల్లో సరిదిద్దుకోవచ్చు
భారతదేశంలోని 169 మంది బిలియనీర్లు
ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల సంఖ్య గతేడాది 2,668 ఉండగా 2023 నాటికి 2,640కి తగ్గింది, భారతదేశంలో వారి సంఖ్య 2022లో 166 నుండి ఈ సంవత్సరం (2023) 169కి పెరిగింది.
జాబితాలో ప్రపంచంలో 735 మంది బిలియనీర్లు
ఫోర్బ్స్ ప్రకారం, అమెరికాలో అత్యధిక బిలియనీర్లు ఉన్నారు. 735 జాబితా సభ్యుల నికర ఆస్తుల విలువ 4.5 ట్రిలియన్ డాలర్లు. 2 ట్రిలియన్ డాలర్ల విలువైన 562 బిలియనీర్లతో చైనా (హాంకాంగ్, మకావుతో సహా) రెండవ స్థానంలో ఉంది. 675 బిలియన్ డాలర్ల విలువైన 169 బిలియనీర్లతో భారతదేశం రెండవ స్థానంలో ఉంది.