అత్యంత సంపన్న భారతీయ టైటిల్ ను గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి ముఖేష్ అంబానీ సొంతం చేసుకున్నారు. బుధవారం విడుదల చేసిన 2023 హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ 82 బిలియన్ డాలర్ల సంపదతో అత్యంత సంపన్న భారతీయుడిగా నిలిచారు. తొమ్మిదో స్థానంలో ఉన్న అంబానీ ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు కావడం విశేషం. అంబానీ తన సంపదలో 20 శాతం కోల్పోయినప్పటికీ.. 82 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే కుబేరుల జాబితాలో 9వ స్థానంలో నిలిచారు.
Also Read: Green Corridor: జాతీయ రహదారులపై హెచ్ఎండిఏ పూలబాటలు
మరోవైపు వ్యాపార దిగ్గజం అదానీ ర్యాంకింగ్ జాబితాలో 53కి పడిపోయింది. అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసానికి పాల్పడిందని ఆరోపించిన US షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ యొక్క నివేదిక తర్వాత అదానీ సంపద గరిష్ట స్థాయి నుండి 60 శాతానికి పైగా పడిపోయింది. ఈ రిపోర్ట్ వెలువడక ముందు అదానీ ప్రపంచ కుబేరుల లిస్ట్‌లోనే 2వ స్థానంలో ఉన్నారు. అదానీ ఇప్పుడు దాదాపు USD 53 బిలియన్ల సంపదతో భారతీయ సంపన్నుల జాబితాలో రెండవ స్థానానికి పడిపోయారు. హురున్ జాబితా ప్రకారం, సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ పూనావల్లా దాదాపు USD 27 బిలియన్ల సంపదతో మూడవ అత్యంత సంపన్న భారతీయుడు.
Also Read: Bilkis Bano Plea: బిల్కిస్ బానో అభ్యర్థన.. ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు సుప్రీం అంగీకారం
ఇతర భారతీయులలో హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ శివ్ నాడార్ USD 26 బిలియన్ల సంపదతో నాల్గవ సంపన్న భారతీయులుగా అవతరించారు. USD 25 బిలియన్లతో ఆర్సెలార్ మిట్టల్‌కు చెందిన లక్ష్మి ఎన్ మిట్టల్ ఐదో స్థానంలో ఉన్నారు. 20 బిలియన్ల సంపదతో SP హిందూజా & కుటుంబం భారతదేశంలో ఆరవ స్థానంలో ఉండగా.. సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్‌కు చెందిన దిలీప్ షాంఘ్వీ కుటుంబం USD 17 బిలియన్ల సంపదతో ఏడవ స్థానంలో నిలిచారు. డిమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ (USD 16 బిలియన్), ఆదిత్య బిర్లా కుటుంబం (USD 14 బిలియన్లు), కోటక్ మహీంద్రా బ్యాంక్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ (USD 14 బిలియన్) భారతదేశంలో వరుసగా ఎనిమిది, తొమ్మిది, పదో స్థానాల్లో ఉన్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా, గత ఏడాది 3,384 మంది బిలియనీర్ల సంఖ్య 3,112కి తగ్గింది. ప్రపంచంలోనే అత్యధిక మంది బిలియనీర్లతో చైనా అగ్రస్థానంలో ఉండగా, అమెరికా, భారత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం, భారతదేశం మొత్తం ప్రపంచ బిలియనీర్ జనాభాలో 8 శాతం వాటాను కలిగి ఉంది, ఐదేళ్ల క్రితం ఇది 4.9 శాతంగా ఉంది.