పిఠాపురం ప్రజల రుణం తీర్చుకోవడానికి జనసేన ఆవిర్భావ సభ ఇక్కడ నిర్వహిస్తున్నాం అని వెల్లడించారు మంత్రి నాదెండ్ల మనోహర్.. అధికారంలో భాగస్వామ్యం అయిన తర్వాత జరిగే సభ కావడంతో చాలా ఆనందంగా జరుపుకుంటున్నాం అన్నారు.. రెండు రాష్ట్రాల నుంచి జనసేన ప్రతినిధులు హాజరవుతారు.. జనసేన సిద్ధాంతాలు జనాల్లోకి తీసుకు వెళ్లడం ఈ ఆవిర్భావ సభ ఉద్దేశని వెల్లడించారు..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి? అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ధ్వజమెత్తారు మంత్రి నాదెండ్ల మనోహర్.. గత ప్రభుత్వంలో 650 కోట్ల రూపాయలతో సలహాదారులు నియమించుకున్నారు.. అంత మంది సలహాదారులను నియమించుకుని కనీసం జల్‌జీవన్ మిషన్ లో రాష్ట్రానికి వచ్చిన ఫండ్ ఉపయోగించుకోలేకపోయారు అంటూ దుయ్యబట్టారు..
జనసేన పార్టీ రాష్ట్రానికి భవిష్యత్ అని ప్రజలు అనుకునే విధంగా సభ నిర్వహించాలి అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారు.. పవన్ వస్తున్నారంటే జనాలను తరలించాల్సిన అవసరం లేదు.. జనసేనలో చాలా మంది పదవులు కోసం ఆశిస్తున్నారు.. పదవులు కోసమే ప్రయాణం చేయకూడదు అని మంత్రి మనోహర్ సూచించారు.
Nadendla Manohar: సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి భరోసా కల్పించేలా బడ్జెట్ ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మూల ధన వ్యయం పెంపుతో భవిష్యత్తుకు బాటలు వేశారు. వసతుల కల్పన, పెట్టుబడుల ఆకర్షణకు అద్భుత అవకాశం.. సూపర్ సిక్స్ పథకాల అమలు దిశగా కేటాయింపులు జరిగాయి..
ధరల పర్యవేక్షణ పై మంత్రుల కమిటీ ఏపీ సచివాలయంలో సమావేశమైంది.. రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ధరల పర్యవేక్షణపై జరిగిన ఈ మంత్రుల కమిటీ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు..
ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఓపీ సేవలు సరిగా అందకపోవడంపై ఆసుపత్రి వర్గాలపై మండిపడ్డారు..
ఉత్తరాంధ్ర జిల్లాల సమీక్ష సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.. పీడీఎస్ రైస్ అక్రమార్కులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వాళ్లపై నేర తీవ్రత ఆధారంగా రౌడీ షీట్లు తెరిచేందుకు వెనుకాడవొద్దు.. 6(ఏ) కేసులు, సీజ్ చేసే విషయంలో అలసత్వం ప్రదర్శించ వద్దు అని స్పష్టం చేశారు..
కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం పట్టుబడిన వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది.. అయితే, మీడియా చిట్‌చాట్‌లో ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.. కాకినాడ పోర్టు వద్ద ఒక ఛీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ను ఏర్పాటు చేస్తామన్న ఆయన.. మూడు షిఫ్టుల్లో భద్రత పెంచుతాం.. ట్రాన్స్‌పోర్ట్ మెకానిజంలో మార్పులు చేపడతాం అన్నారు.. ఐపీసీ ఇన్వాల్వ్ చేసేలా రవాణా వ్యవస్ధ కఠినతరం చేస్తామని వెల్లడించారు..
ఈరోజు వరకు రూ.1050 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేశామని.. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే రెండింతలు కొనుగోలు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఆకస్మికంగా పర్యటించారు.
ఇప్పటి వరకూ రాష్ట్రంలో 418.75 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలులో ఇప్పటి వరకూ 391.50 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇప్పటివరకు 24 గంటల్లోపు 281.30 కోట్లు రైతుల ఖాతాలో జమ అయినట్లు తెలిపారు.