Minister Nadendla Manohar: జనసేన ఆవిర్భావదినోత్సవానికి సిద్ధం అవుతోంది.. ఈ సందర్భంగా పిఠాపురం వేదికగా ఈ సారి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.. అయితే, పిఠాపురం ప్రజల రుణం తీర్చుకోవడానికి జనసేన ఆవిర్భావ సభ ఇక్కడ నిర్వహిస్తున్నాం అని వెల్లడించారు మంత్రి నాదెండ్ల మనోహర్.. అధికారంలో భాగస్వామ్యం అయిన తర్వాత జరిగే సభ కావడంతో చాలా ఆనందంగా జరుపుకుంటున్నాం అన్నారు.. రెండు రాష్ట్రాల నుంచి జనసేన ప్రతినిధులు హాజరవుతారు.. జనసేన సిద్ధాంతాలు జనాల్లోకి తీసుకు వెళ్లడం ఈ ఆవిర్భావ సభ ఉద్దేశని వెల్లడించారు.. ఈ నెల 14న పిఠాపురంలో జరగనున్న జనసేన ఆవిర్భావ సభకు కాకినాడలో కంట్రోల్ ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా కూటమి ప్రభుత్వాన్ని చాలా జాగ్రత్తగా నడుపుతున్నాం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్తాం అని వెల్లడించారు.
Read Also: Hyderabad: పెళ్లయిన నెల రోజులకే.. నవవధువు ఆత్మహత్య
మరోవైపు.. వైఎస్ వివేకానంద హత్య లో సాక్షులుగా ఉన్న ఆరుగురు విచిత్రంగా చనిపోయారు అంటూ జనసేన పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ కామెంట్ చేశారు.. ఆ హత్యలు, మరణాలు వెనుక ఎవరు ఉన్నారో తెలియాలి.. సాక్షులు ను తొలగిస్తున్నారు.. కుటుంబ సభ్యులును కూడా బతకనివ్వడం లేదు.. చనిపోయిన వాళ్లు వృద్ధులు కాదు, ఆరోగ్య సమస్యలు లేవు అని ఆరోపించారు.. ఇక, జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకి ఏర్పాటు చేసిన కమిటీలతో రేపు కాకినాడలో సమావేశం నిర్వహించనున్నారు జనసేన పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్.. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన తర్వాత తొలిసారి పిఠాపురం వేదికగా నిర్వహిస్తోన్న జనసేన ఆవిర్భావోత్సాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనసేన పార్టీ..