Nadendla Manohar: సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి భరోసా కల్పించేలా బడ్జెట్ ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మూల ధన వ్యయం పెంపుతో భవిష్యత్తుకు బాటలు వేశారు. వసతుల కల్పన, పెట్టుబడుల ఆకర్షణకు అద్భుత అవకాశం.. సూపర్ సిక్స్ పథకాల అమలు దిశగా కేటాయింపులు జరిగాయి.. పంచాయతీరాజ్ శాఖకు భారీ కేటాయింపులతో పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతుంది అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ ని స్వాగతిస్తున్నాం అని ఆయన చెప్పారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల మన్ననలు అందుకుంటుంది.. మూలధన వ్యయం భారీగా పెంచడం వల్ల పెట్టుబడుల ఆకర్షణకు అవకాశం కలుగుతుంది అని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ వెల్లడించారు.
Read Also: Vivo T4x 5G: బడ్జెట్ ధరలో.. పవర్ ఫుల్ ఫీచర్లతో మార్కెట్‌లోకి వచ్చేస్తోన్న వివో కొత్త స్మార్ట్ ఫోన్
ఇక, గత ప్రభుత్వంలో పెట్టుబడుల సాధనకు నిధుల కేటాయింపుపై దృష్టి పెట్టలేదు అని మంత్రి మనోహర్ చెప్పుకొచ్చారు. సుమారు 47 వేల కోట్ల రూపాయలను మూల ధన వ్యయం కింద ప్రతిపాదించడం పట్ల హర్షిస్తున్నాం అన్నారు. దీపం- 2 పథకం అమలుకు 2,601 కోట్ల రూపాయలు కేటాయించారు.. విద్యుత్ సబ్సిడీ ప్రకటనతో ఆక్వా రంగానికి ఊతం ఇచ్చామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ ని జనసేన పార్టీ స్వాగతిస్తుంది అని మంత్రి తెలిపారు.