Minister Nadendla Manohar: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి? అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ధ్వజమెత్తారు మంత్రి నాదెండ్ల మనోహర్.. గత ప్రభుత్వంలో 650 కోట్ల రూపాయలతో సలహాదారులు నియమించుకున్నారు.. అంత మంది సలహాదారులను నియమించుకుని కనీసం జల్‌జీవన్ మిషన్ లో రాష్ట్రానికి వచ్చిన ఫండ్ ఉపయోగించుకోలేకపోయారు అంటూ దుయ్యబట్టారు.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీకే రారు.. ఏ విధంగా ప్రజా సమస్యలపై మాట్లాడతారు అని నిలదీశారు.. అసలు, క్రిమినల్ మైండ్ తో పవన్ కల్యాణ్‌ని ప్రత్యేకంగా టార్గెట్ చెయ్యాల్సిన అవసరం ఏం వచ్చింది అని మండిపడ్డారు.. ఏ విధంగా బాబాయ్ హత్య జరిగింది అనేది అందరికీ తెలుసన్న నాదెండ్ల మనోహర్.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే.. బీజేపీతో మాట్లాడి తీసుకొచ్చిన పవన్ కల్యాణ్‌తో కలిసి పని చేయాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. ఎన్నికలకు చాలా రోజులు ఉన్నాయి.. పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తే తప్పకుండా సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుందని హెచ్చరించారు..
Read Also: Lady Aghori: నల్లపాడు పోలీస్ స్టేషన్లో మహిళ అఘోరికి కౌన్సిలింగ్..
ప్రజాస్వామ్యంలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది నిన్నటి ఎన్నికల నిదర్శనంగా పేర్కొన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. వై నాట్ 175 అని ఎగిరిన మనిషి 11కు పడిపోవడంతో మతి భ్రమించిందని వ్యాఖ్యానించిన ఆయన.. దీంతో.. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జర్మనీ చట్టాలు ఏపీలో అమలు చేస్తానంటే ఎలా? అని ప్రశ్నించారు. తాడు బొంగరం లేని పార్టీ.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అని సెటైర్లు వేశారు. తన ప్రజా జీవితంలో ఒక్క రూపాయి అయినా ఇచ్చి దాతగా జగన్ నిలబడ్డారా ? అని నిలదీశారు.. కానీ, మా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వేలాదిమందికి ఆర్ధిక సాయం చేశారని వెల్లడించారు మంత్రి నాదెండ్ల మనోహర్.