రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డు దారులకు సబ్సిడీపై కందిపప్పు, పంచదార పంపిణీ చేసే కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో మంగళవారం మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ప్రారంభించారు.
తిరుమల లడ్డు కల్తీ ఘటనను నిరసిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా తెనాలి వైకుంఠపురం దేవస్థానంలో తలపెట్టిన మహాయాగంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలన చాలా బాగుందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో మాట్లాడుతూ.. ప్రజలు ఏం కోరుకున్నారో అలాంటి పాలన అందించగలిగామన్నారు.
అక్టోబర్ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. 10 జిల్లాల జాయింట్ కలెక్టర్లతో సమావేశం నిర్వహించామన్నారు.
లీడర్ అంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ లాగా స్పందించే మనసు ఉండాలి అన్నారు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. రాష్ట్రంలో వరదలు, వర్షాలతో భారీగా నష్టం జరిగింది.. లక్షలాది మంది ప్రజలు ముంపు బారిన పడ్డారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుభవంతో ఈ విపత్తు నుంచి ప్రజలను గట్టెక్కించారు.. కానీ, వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శలు చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.
వరద బాధిత కుటుంబాలకు శుక్రవారం నిత్యావసర వస్తువుల పంపిణీ ప్రారంభించనుంది ఏపీ పౌరసరఫరాల శాఖ.. సుమారు 2 లక్షల మంది లబ్ధిదారులకు ఈ పంపిణీ జరగనుంది.. 179 వార్డు,3 గ్రామ సచివాలయాల పరిధిలో పంపిణీ చేపట్టనున్నారు.. ముంపు బాధితులు అందరికీ నిత్యావసర వస్తువులు అందిస్తామని వెల్లడించారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్...
అవినీతి లేకుండా పంచాయితీ వ్యవస్థని బలోపేతం చేసుకునే విధంగా గ్రామ సభలు జరగాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురంలో గ్రామ సభలో పాల్గొన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. గ్రామ సభలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలు స్వీకరించి , వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Nadendla Manohar: త్వరలోనే 41 A కింద నోటీసులు ఇచ్చి రేషన్ బియ్యం అక్రమ తరలింపు చేసిన వారి అరెస్టులు కూడా ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. ఇప్పటికే 6A కింద నోటీసులు ఇచ్చి క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు.
గత ప్రభుత్వం రైతులను సంక్షోభంలో నెట్టింది.. ప్రభుత్వ నిబంధనల మేరకు పంట పండించిన అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి.. రైతులను గత ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టిందో ప్రత్యక్షంగా చూశాం అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్
రైతులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. గత రబీ సీజన్లో ధాన్యం విక్రయించి.. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల కోసం ఎదురుచూస్తున్న రైతులకు తీపికబురు చెప్పింది కూటమి ప్రభుత్వం.. పాత బకాయిలను అందించడానికి ఇవాళ్టి నుంచి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.