రైతులు చెమటోడ్చి పండించిన ధాన్యం విక్రయించుకొనేందుకు ప్రయాస అవసరం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రైతు Hi అంటే చాలు.. ధాన్యం కొనుగోలు చకచకా జరిగిపోతుందన్నారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పలు రైస్ మిల్లులలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సత్తెనపల్లిలో అనేక మిల్లులో పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నామని మంత్రి వెల్లడించారు.
బియ్యం అక్రమ రవాణా అడ్డుకట్టకు సహకరించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ మిల్లర్లను కోరారు. జాతీయ రైస్ మిల్లర్స్ అసోయేషన్ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్.. మిల్లర్లపై మార్కెట్ సెస్ 2 శాతం నుంచి 1 శాతానికి తగ్గించాలని మంత్రుల సమావేశంలో చర్చించామన్నారు. బియ్యం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా సహకరిస్తామని మిల్లర్లు హామీ ఇచ్చారు.
తిరుపతిలో దీపం-2 పథకం కార్యక్రమాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే వారిపై ఛాలెంజ్ విసురుతున్నానని.. వైసీపీ నేతలు దీపం-2 పథకం కార్యక్రమాలకు రావాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉచిత సిలిండర్ ఇస్తున్న విషయాన్ని వైసీపీ నేతలు గమనించాలన్నారు.
మహిళల కోసం ఉచితంగా మూడు సిలిండర్ల పథకం తీసుకొచ్చాం అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.. అయితే, ఈ పథకంలో ఎవరూ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదన్నారు.. గ్యాస్ కనెక్షన్, రైస్ కార్డు (రేషన్ కార్డు)లకు ఆధార్ కార్డు నంబర్ అనుసంధానం చేసుకుని ఉంటే చాలు.. వారు అర్హులే అని స్పస్టం చేశారు..
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.. ఈ పథకం కింద ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు పంపిణీ చేయబోతున్నారు.. ఈ పథకంలో అమలులో అర్హతలు.. దరఖాస్తు.. మార్గదర్శకాలను ఇప్పటికే ప్రభుత్వం ఖరారు చేయగా.. ఈ రోజు మరింత క్లారిటీ ఇచ్చారు మంత్రి మంత్రి నాదెండ్ల మనోహర్.. సూపర్ సిక్స్ లో ప్రధానమైనది ౩ ఉచిత సిలిండర్ల పథకాన్ని ఈ నెల 31న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తాం…
మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు సూపర్ సిక్స్ లో భాగంగా తొలిఅడుగు అని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మహిళా సాధికారతలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు దీపావళి రోజున ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో అర్హత ఉన్న మహిళలకు మూడు గ్యాస్ కంపెనీల ద్వారా అందిస్తున్నామన్నారు. అక్టోబర్ 31న డెలివరీ జరిగేలా చూడాలని సీఎం చెప్పారని వెల్లడించారు.
ప్రజలకు విక్రయించే సరుకులు నాణ్యత, ధరలపై విజయవాడలోని పడమట రైతుబజార్, గురునానక్ కాలనీ నందు ఉషోదయ సూపర్ మార్కెట్‌ను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ధరల స్థిరీకరణ విషయంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని రైతు బజార్లు, సంస్థాగత రిటైల్ దుకాణాలలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే నాణ్యమైన సరకులను వినియోగదారులకు అందించాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.. పెరిగిన వంట నూనెల ధరలతో ఇబ్బంది పడుతోన్న ప్రజలకు తక్కువ ధరకే వంట నూనెలు అందిస్తోంది.. ఇవాళ్టి నుంచి వంట నూనె ధరలు తగ్గించి అమ్మాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.. కిలో పామాయిల్ రూ. 110, సన్ ఫ్లవర్ నూనె రూ.124కే విక్రయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక కోసం ప్రజల భాగస్వామ్యం కోసం అభిప్రాయ సేకరణ చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. యాభై వేల ప్రజల నుంచి విభిన్న ఆలోచనలతో అభిప్రాయ సేకరణ జరిగిందని వెల్లడించారు. రాజధాని ప్రాంతంలోని గుంటూరు జిల్లాలో యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. కమర్షియల్ క్రాప్స్ పండించే రైతన్నకు భరోసాగా ఈ ప్రభుత్వం ఉంటుందని హామీ ఇచ్చారు.