విజయవాడ తూర్పు నియోజకవర్గంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభించారు మంత్రి నాదెండ్ల మనోహర్.. వరలక్ష్మి నగర్‌లో ఇంటింటికీ వెళ్లి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్,ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కలెక్టర్ లక్ష్మీషా.. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ.. నేడు రాష్ట్రంలో పండుగ వాతావరంలో స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ జరుగుతుందన్నారు.. రేషన్ పంపిణీలో అక్రమాలు అరికట్టడానికి స్మార్ట్ కార్డులు అందుబాటులోకి తెచ్చాం.. స్మార్ట్ కార్డ్స్ వల్ల ఉన్నతస్థాయిలో మానిటరింగ్ జరుగుతుందని వెల్లడించారు..
ఇవాళ్టి నుంచి స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేయనున్నారు.. ఉదయం 10:30కు వరలక్ష్మీనగర్, విజయవాడ ఈస్ట్, ఎన్టీఆర్ జిల్లా.. మధ్యాహ్నం 12:00 గంటలకు కంకిపాడు, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణా జిల్లాలో.. ఇంటింటికి స్మార్ట్ రైస్ కార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ అందించింది. రేపటి నుంచి ఇంటింటికీ ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. నాలుగు విడతల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ చేయనున్నారు. ఆయా రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులకు అందజేయనున్నారు. మొదటి విడత లో రేపటి నుంచి 9 జిల్లాల్లో కార్డుల పంపిణీ చేపట్టనున్నారు. విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ చేయనున్నారు. రెండో…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సిద్ధమైంది.. పాత రేషన్ కార్డుల స్థానంలో కీలక మార్పులతో స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకురానుంది.. ఈ నెల 25వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని.. ఈ నెల 31వ తేదీ వరకు రేషన్ కార్డులు పంపిణీని పూర్తి చేయాలని నిర్ణయించింది.
వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి నాదెండ్ల మనోహర్.. అవగాహన లేకుండా, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు అంటూ ధ్వజమెత్తారు. ప్రజలు అధికారాన్ని ఐదేళ్లకు ఇస్తారు.. అది జగన్ మర్చిపోయారా? అని నాదెండ్ల ప్రశ్నించారు. ఇంతకాలం గుంతలు కూడా పూడ్చలేని నాయకుడు.. ఈ రోజు పాలన గురించిమాట్లాడుతున్నాడు అంటూ ఫైర్ అయ్యారు.
కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ది చాలా కీలక పాత్ర.. పాలసీ మేకింగ్, వాగ్దానాల అమలు విషయంలో పవన్ కల్యాణ్ అన్నిటినీ సమన్వయం చేస్తూ ముందుకెళ్తున్నారు. కూటమిలో జనసేనకు ఎక్కువ బాధ్యత ఉంది.. ప్రజలకోసం కూటమికి జనసేన ఎప్పుడూ సహకరిస్తుందని తెలిపారు జనసేన పీఏసీ చైర్మన్, ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్..
గ్రామ వార్డ్ సచివాలయంలో కొత్త రేషన్ కార్డు కోసం వివరాలు నమోదు చేసుకోవాలి అని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల చెప్పారు. జూన్ లో అందరికి కొత్త రేషన్ కార్డులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రేషన్ కార్డుల జారీపై కీలక ప్రకటన చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.. ఈ కేవైసీ నమోదు పూర్తి అయిన తర్వాత కొత్త రేషన్ కార్డులపై దృష్టి పెడతాం అన్నారు.. ఈ నెలాఖరులోగా ఈ కేవైసీ పూర్తి చేస్తాం అన్నారు మంత్రి మనోహర్.. కుటుంబ సభ్యుల వివరాలు అన్ని ఈ కార్డ్‌లో ఉంటాయన్నారు.. రేషన్ కార్డు అని కాకుండా ఫ్యామిలి కార్డుగా ఉంటుందన్నారు.. ఏటీఎం కార్డు తరహాలో స్మార్ట్‌గా రేషన్ కార్డు ఉంటుందని వెల్లడించారు..
యువత కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తపన పడుతున్నారు.. ఉత్తరాంధ్రకు భారీ పెట్టుబడులు వస్తాయని తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్.. విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ.. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఉత్తరాంద్ర యువతకు ఉపాధి కల్పించాలని తపన పడుతున్నతారు.. ఉత్తరాంద్రకు భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు..
పీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరోవైపు.. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మపై కీలక వ్యాఖ్యలు చేశారు.. జనసేన పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్.. పిఠాపురం పవన్ కల్యాణ్ అడ్డా అని పేర్కొన్న ఆయన.. ఇక, వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్.. వాళ్ల పార్టీ.. ఆయన విషయంలో నిర్ణయం తీసుకుంటుంది, అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు.. వర్మని గౌరవించడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదన్న ఆయన.. వర్మకి చెక్…