డబ్బులు సంపాదించడం ప్రతి వ్యక్తి కోరిక. దాని కోసం పగలు రాత్రి కష్టపడి పనిచేస్తుంటాం. అయితే.. కొన్నిసార్లు వ్యక్తులకు అదృష్టం కలిసి వస్తుంది. ఎటువంటి కష్టపడకుండానే డబ్బు పొందుతారు. ఓ రైతు విషయంలో కూడా అదే జరిగింది. రూ.287 కోట్ల విలువైన లాటరీ తగిలింది. కానీ.. ఆయన సంతోషించే లోపే ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. అసలేం జరిగిందటే..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. మహిళల భద్రత, రాజధానిలో పెరుగుతున్న నేరాల గ్రాఫ్‌ను ఎన్నికల ముందు పెద్ద సమస్యగా మార్చాలని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తోంది. గత నెల రోజుల నుంచి ఢిల్లీలో శాంతిభద్రతలు, మహిళా భద్రతపై కేజ్రీవాల్ కేంద్రాన్ని నిందిస్తున్నారు. వీటిని ఆయుధంగా మలచుకున్నట్లు కనిపిస్తోంది. ఈ అంశాల్లో కేంద్రం పూర్తిగా విఫలమైందని జనాలను నమ్మించి.. ఓట్లు దండుకునేందుకు యత్నిస్తున్నారని పలువురు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
చాలా మంది ప్రైవేట్ ఉద్యోగానికి బదులు ప్రభుత్వ ఉద్యోగానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే కర్ణాటకలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాల పనితీరు, ఉద్యోగులపై విపరీతమైన ఒత్తిళ్లపై ఓ తహసీల్దార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీశాయి. ప్రభుత్వ ఉద్యోగంలో మిగిలేది లేదని, పానీపూరీ అమ్మే వాడు మనకంటే గొప్పవాడని తహసీల్దార్ చెప్పారు. పానీ పూరీ అమ్మేవాడి సంపాదన కూడా తమ కంటే…
ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజాలో ఓ విచిత్రమైన, బాధాకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ వ్యక్తి తంత్ర మంత్రానికి బలై.. బతికి ఉన్న కోడిపిల్లను మింగేశాడు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చనిపోయాడు. తొలుత గుండెపోటుతో యువకుడు మృతి చెంది ఉంటాడని వైద్యులు భావించారు. అయితే పోస్ట్‌మార్టం చేయగా గొంతులో చనిపోయిన కోడిపిల్ల కనిపించింది.
సంధ్య థియేటర్ ఘటనలో అరెస్ట్ అయి.. బెయిల్ వచ్చినా.. అది సరైన సమయానికి జైలుకు చేరకపోవడంతో.. ఒకరోజు జైలులో ఉండి.. చంచల్‌గూడ జైలు నుంచి విడుదయ్యాడు.. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో అల్లును అరెస్టు చేశారు. అయితే శుక్రవారం రాత్రి జైలు జీవితం గడిపిన ఐకాన్ స్టార్ శనివారం ఉదయం విడుదలయ్యాడు. అల్లు తిరిగి రావడంతో ఆయన కుటుంబసభ్యులు, అభిమానుల్లో ఆనంద వాతావరణం నెలకొంది. భార్య స్నేహారెడ్డి అతన్ని గట్టిగా కౌగిలించుకుని, భావోద్వేగానికి లోనైంది. అల్లు అర్జున్ అరెస్ట్…
సంధ్య థియేటర్ ఘటనలో అరెస్ట్ అయి.. బెయిల్ వచ్చినా.. అది సరైన సమయానికి జైలుకు చేరకపోవడంతో.. ఒకరోజు జైలులో ఉండి.. చంచల్‌గూడ జైలు నుంచి విడుదయ్యాడు.. మొదట గీతాఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు.. అక్కడ కాసేపు గడిపిన తర్వాత తన నివాసానికి చేరుకున్నారు.. కుటుంబ సభ్యులు బన్నీని చూసి భావోద్వేగానికి గురయ్యారు.. సంధ్య థియేటర్ ఘటనపై స్పందిస్తూ.. ఒకరు చనిపోవడం దురదృష్టకరమైన ఘటన అన్నారు.. బాధిత రేవతి కుటుంబానికి మరోసారి క్షమాపణ చెప్పారు.. అనుకోకుండా జరిగిన ఈ ఘటన…
అదానీ లంచం వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం తొలిసారిగా స్పందించారు. మీడియా కథనాల ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోదని, డాక్యుమెంట్ల ఆధారంగానే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదానీ కేసుపై పార్లమెంట్‌లో చర్చించాలని ప్రతిపక్షాలు నిరంతరం డిమాండ్ చేస్తున్న తరుణంలో కేంద్ర హోం మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
లైకులు, కామెంట్ల కోసం కొందరు ఎన్ని విన్యాసాలు అయినా చేస్తారు. అలాంటి విన్యాసాల వీడియోలు సోషల్ మీడియాలో బోలెడు దొరుకుతాయి. కొందరు స్టంట్స్ చేయబోయి అడ్డంగా బుక్కయిపోవడం కూడా చూశాం. కొందరు స్టంట్స్‌ను అదరగొట్టేస్తారు. మరికొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ముఖ్యంగా ప్రమాదకరమైన ప్రాంతాల్లో సెల్ఫీలు అంటూ స్టంట్స్ అంటూ చేసి ఎంతో మంది ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియో వైరల్‌గా మారింది. READ MORE: UPI: వామ్మో.. యూపీఐ ద్వారా11…
నేడు పార్లమెంట్ సమావేశాల్లో 75 ఏళ్లు పూర్తి చేసుకున్న భారత రాజ్యాంగం, రాజ్యాంగ ప్రయాణంపై చర్చ జరిగింది. డిసెంబరు 13 నుంచి లోక్‌సభలో రాజ్యాంగంపై రెండు రోజుల చర్చను ఏర్పాటు చేశారు. ప్రతిపక్ష ఎంపీల ప్రసంగాల అనంతరం ప్రధాని మోడీ పార్లమెంట్‌లో ప్రసంగించారు. ప్రసంగం మధ్యలో కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం రాజ్యాంగం ఏర్పడి 25 ఏళ్లు పూర్తవుతున్న వేళ రాజ్యాంగాన్ని లాక్కున్నారన్నారు. దేశాన్ని జైలుగా మార్చి పౌరుల హక్కులను కాలరాశారన్నారు.
లోక్‌సభలో శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగంపై చర్చ జరుగుతోంది. మరోవైపు పార్లమెంటుకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి సభ్యులు ఘనస్వాగతం పలికారు. 'భారత్ మాతా కీ జై' నినాదాలతో ప్రధానికి స్వాగతం పలికారు. రాజ్యాంగం ఆవిర్భవించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్‌సభలో మోడీ ప్రసంగించారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని, మన గణతంత్ర దేశం యావత్ ప్రపంచానికి స్ఫూర్తిదాయకమన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని దాని సంస్కృతిలో భాగమన్నారు.