ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజాలో ఓ విచిత్రమైన, బాధాకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ వ్యక్తి తంత్ర మంత్రానికి బలై.. బతికి ఉన్న కోడిపిల్లను మింగేశాడు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చనిపోయాడు. తొలుత గుండెపోటుతో యువకుడు మృతి చెంది ఉంటాడని వైద్యులు భావించారు. అయితే పోస్ట్‌మార్టం చేయగా గొంతులో చనిపోయిన కోడిపిల్ల కనిపించింది.
READ MORE: Pushpa2 : హిందీలో వండర్స్ క్రియేట్ చేస్తున్న పుష్ప -2
విషయం అంబికాపూర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతుడు చింద్‌కలో గ్రామానికి చెందిన ఆనంద్ కుమార్ యాదవ్ (36)గా గుర్తించారు. పెళ్లయి ఐదేళ్లు గడుస్తున్నా బిడ్డలు కాకపోవడంతో ఆందోళన మొదలైంది. అప్పుడు ఓ వ్యక్తి తాంత్రికుడి దగ్గరకు వెళ్లాలని సలహా ఇచ్చాడు. దీంతో ఆ తాంత్రికుడు క్షుద్ర పూజల పేరుతో బతికి ఉన్న కోడిని మింగమని సూచించారు. ఆనంద్ ఏమీ ఆలోచించకుండా దాన్ని మింగేశాడు.
READ MORE:Expensive Tea: ఒక కప్పు టీ ధర రూ. లక్ష.. దీన్ని తాగాలంటే ఈఎంఐ తీసుకోవాల్సిందే?
ఈ అంశంపై అంబికాపూర్ హాస్పిటల్ ఫోరెన్సిక్ హెచ్‌వోడీ డాక్టర్ మాట్లాడుతూ.. ఆదివారం ఒక రోగిని మా వద్దకు తీసుకువచ్చారు. అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. గుండెపోటుతో చనిపోయి ఉండవచ్చని తొలుత అనిపించింది. ఆ తర్వాత మరణానికి అసలు కారణం తెలుసుకునేందుకు పోస్ట్‌మార్టం నిర్వహించాం. అయితే.. పేషెంట్ గుండెపోటుతో చనిపోలేదని తేలిపోయింది. గొంతు భాగాన్ని పరిశీలించగా.. కోడిపిల్లను చూశాం. అది యువకుడి శ్వాసనాళానికి, ఆహార పైపునకు మధ్య ఇరుక్కుపోయింది. దీని కారణంగా అతడు చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.