సంధ్య థియేటర్ ఘటనలో అరెస్ట్ అయి.. బెయిల్ వచ్చినా.. అది సరైన సమయానికి జైలుకు చేరకపోవడంతో.. ఒకరోజు జైలులో ఉండి.. చంచల్‌గూడ జైలు నుంచి విడుదయ్యాడు.. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో అల్లును అరెస్టు చేశారు. అయితే శుక్రవారం రాత్రి జైలు జీవితం గడిపిన ఐకాన్ స్టార్ శనివారం ఉదయం విడుదలయ్యాడు. అల్లు తిరిగి రావడంతో ఆయన కుటుంబసభ్యులు, అభిమానుల్లో ఆనంద వాతావరణం నెలకొంది. భార్య స్నేహారెడ్డి అతన్ని గట్టిగా కౌగిలించుకుని, భావోద్వేగానికి లోనైంది. అల్లు అర్జున్ అరెస్ట్ పై స్టార్స్ రియాక్షన్స్ బయటకు వస్తున్నాయి. చాలా మంది స్టార్లు అల్లుకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ నటుడు సోనూసూద్ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించారు.
సోనూసూద్ అల్లుకు మద్దతుగా నిలిచాడు
సోనూ సూద్ త్వరలో తన తదుపరి చిత్రం ‘ఫతే’లో కనిపించనున్నారు. తాజాగా గుజరాత్‌లో తన ఈ సినిమాను ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ పరిస్థితిలో ఆయన ఓ జాతీయ మీడియా సంస్థతో తన సినిమాతో పాటు అల్లు అర్జున్ అరెస్ట్ గురించి కూడా మాట్లాడారు. “ఈ సమస్య ఇప్పటికే పరిష్కరించబడిందని నేను భావిస్తున్నాను. ఏదో సామేత చెప్పినట్లుగా అంతా మంచే జరుగుతుంది. నేను అల్లు అర్జున్‌ను అభినందించాలనుకుంటున్నాను. నేను అతనితో ఇంతకు ముందు కలిసి పనిచేశాను. ఇది ఒక నటుడి జీవితం. ఎత్తుపల్లాలు ప్రయాణంలో భాగం.” అని ఆయన వ్యాఖ్యానించారు.
READ MORE: Minister Partha Sarathy: గత ఐదేళ్ల పాలన స్వార్థ రాజకీయాలకు నిదర్శనం: మంత్రి పార్థసారథి