హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు వివాదాలకు మరో వివాదంలో చిక్కుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం 'సర్కార్ గావ్ కే ద్వార్' కింద సిమ్లా జిల్లా చౌపాల్ సబ్-డివిజన్‌లోని కుప్వి తహసీల్‌లోని టిక్కర్ గ్రామంలో ఆయన బస చేశారు. విందులో ముఖ్యమంత్రితో పాటు ఇతర అతిథులకు స్థానిక వంటకాలను వడ్డించారు. ఈ మోనూలో "వైల్డ్ చికెన్" కూడా ఉంది. సీఎం ఆ కూర తినలేదు. అయినప్పటికీ.. ఈ రకం కోడి కూరను మెనూలో చేర్చడాన్ని…
ముస్లింల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో 46 ఏళ్ల నాటి దేవాలయం బయట పడింది. ఈ శివాలయాన్ని బయటపడకుండా దాచినట్లు తెలుస్తోంది. ఈ పరమేశ్వరుని ఆలయాన్ని పోలీసులు గుర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వాస్తవానికి.. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని జామా మసీదు హింసాకాండ జరిగినప్పటి నుంచి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల దుండగులపై సెర్చ్ ఆపరేషన్ జరిగింది. ఈ సమయంలో పలు ఏరియాల్లో తిరిగి తనిఖీ చేసిన ఎస్పీ కృష్ణ కుమార్ బిష్ణోయ్.. అక్రమ కరెంట్ కనెక్షన్లను…
షేర్ మార్కెట్ కొంప ముంచింది. ఓ ఇంటి యజమానికి షేర్ మార్కె్ట్లో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా నష్టపోయాడు. అప్పుల బాధ భరించలేక కుటుంబం మొత్తం బలవన్మరణానికి పాల్పడింది. చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం కాసిపేట గ్రామానికి చెందిన సముద్రాల మొండయ్య ( 60), శ్రీదేవి (50) దంపతులకు ఇద్దరు సంతానం. మొండయ్య అప్పులు చేసిన మరీ షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా…
మహా కుంభమేళా 2025 జనవరి 13 నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. భక్తుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా దాదాపు 50 రోజుల పాటు కొనసాగుతుంది. మహాకుంభం ప్రపంచంలోనే అతి పెద్ద జాతరగా చెబుతారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఇందులో పాల్గొంటారు. రాజ స్నానాలు ఆచరిస్తారు. ప్రయాగ్‌రాజ్‌లో చివరిసారిగా 2012లో మహా కుంభమేళా జరిగింది.
అదానీ కేసుపై లోక్‌సభలో విపక్ష ఎంపీలు సోమవారం పార్లమెంట్ కాంప్లెక్స్‌లో నిరసన తెలిపారు. ఈ నిరసనలో కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. నిరసన సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాణికం ఠాగూర్, సప్తగిరి శంకర్ ఉలక ప్రధాని మోడీ, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ మాస్క్‌లు ధరించారు. వీరిద్దరినీ ఫొటోలు తీస్తూ.. హడావిడి చేస్తున్న వీడియోను రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. మోడీ, అదానీని ఉద్దేశించి..”వీరిది…
సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్, ఆయన కుటుంబ సభ్యులు రష్యాకి చేరుకున్నారు. ఈ మేరకు రష్యా ప్రభుత్వ వార్తా సంస్థలు నివేదించాయి. ఇస్లామిస్ట్ నేతృత్వంలోని తిరుగుబాటుదారులు సిరియాను తమ ఆధీనంలోకి తీసుకున్న కోవడంతో తన కుటుంబంతోపాటు అధ్యక్షుడు రష్యాలోని మాస్కోకి చేరుకున్నారు."అస్సాద్, ఆయన కుటుంబ సభ్యులకు మానవతా దృక్పథంతో రష్యా ఆశ్రయం కల్పించింది" అని స్థానిక వార్తా సంస్థ నివేదిక పేర్కొంది.
ఈరోజుల్లో నగలు ధరించి ఇంటి నుంచి బయటకు వెళ్లడం ప్రమాదకరంగా మారింది. దొంగతనాలు, దోపిడీ ఘటనలు ఎక్కువవయ్యాయి. దీంతో ప్రజలు అప్రమత్తం అయ్యారు. అయితే దుబాయ్‌లో ఓ మహిళ ఆభరణాల భద్రతకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దుబాయ్‌కి చెందిన ఓ యువతి బహిరంగ ప్రదేశాల్లో ఆభరణాల భద్రతకు సంబంధించి ఆశ్చర్యకరమైన ప్రయోగం చేసింది.
బ్రిటన్, అమెరికా, కెనడా ఇలా ఏ దేశానికి వెళ్లినా అక్కడి భారతీయ రెస్టారెంట్ ను చూసినప్పుడల్లా మనం గర్వపడుతుంటాం. ఈ రెస్టారెంట్లు, పలు అంశాల్లో విదేశాల్లో భారతీయులు మంచి పేరు సంపాదించుకుంటున్నారు. భారతదేశంలో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయని భావిస్తుంటారు. అయితే బాగా పరిశీలిస్తే ఇక్కడ కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి.
తనపై కుట్ర జరుగుతోందని పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అన్నారు. ఇందులో పోలీసులు కూడా భాగస్వాములయ్యారని ఆరోపించారు. తనతో పాటు తన సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌ను ఇరికిస్తున్నారన్నారు. నేను జైలులో ఉన్నాను. ఇక్కడి నుంచి ఒక వ్యక్తిని ఎలా బెదిరిస్తాను? అని పేర్కొన్నారు. జైలు నుంచి హత్య ఎలా చేస్తాం? అని తెలిపారు. శనివారం జోధ్‌పూర్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో లారెన్స్ బిష్ణోయ్ తన వివరణ ఇచ్చారు.
ట్రక్కును నడపాలంటే ఎంతో ఏకాగ్రత అవసరం. ఏ మాత్రం అజాగ్రత్త వహించిన భారీ మూల్యం తప్పదు. అయితే.. లారీ నడిపేటప్పుడు స్టీరింగ్‌పై రెండు చేతులు ఉంచి కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. కాళ్లు బ్రేక్, యాక్సిలరేటర్, క్లచ్‌ను నియంత్రిస్తాయి. వీటితో పాటు చేతితో గేర్లు వేస్తాం. కానీ.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి కేవలం తన పాదాలతో స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ.. వాహనాన్ని నడపడం కనిపిస్తుంది.