అదానీ లంచం వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం తొలిసారిగా స్పందించారు. మీడియా కథనాల ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోదని, డాక్యుమెంట్ల ఆధారంగానే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదానీ కేసుపై పార్లమెంట్‌లో చర్చించాలని ప్రతిపక్షాలు నిరంతరం డిమాండ్ చేస్తున్న తరుణంలో కేంద్ర హోం మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
READ MORE: Amit Shah: భారత్ త్వరలోనే నక్సలిజం నుండి విముక్తి పొందుతుంది..
ఓ జాతీయ మీడియా సంస్థ ఇంటిర్య్వూలో అమిత్ షా మాట్లాడారు. “అమెరికాలో గౌతమ్ అదానీపై వచ్చిన ఆరోపణలను భారత హోం మంత్రిత్వ శాఖ ఎలా చూస్తుంది?” అని జర్నలిస్టు షా ను ప్రశ్నించారు. ‘‘వేరే దేశంలోని కోర్టులో ఆరోపణలు ఉన్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఆరోపణలపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఏ ప్రభుత్వమూ వ్యవహరించదు.. అక్కడ ఆరోపణలు రుజువైన తర్వాత పత్రాలు మనదేశానికి వస్తాయి. వాటిని పరిశీలించిన చర్యలు తీసుకుంటాం.” అని షా స్పష్టం చేశారు.
READ MORE: Encounter: ఎన్కౌంటర్ అబద్ధం! పిచ్చి డివిజనల్ కమిటీ పేరుతో మావోయిస్టుల కరపత్రం..
అసలు ఆరోపణలు ఏంటి?
గౌతమ్ అదానీపై విదేశీ లంచం, సెక్యూరిటీల మోసం, వైర్ ఫ్రాడ్ కుట్ర, సంబంధిత అభియోగాలు ఉన్నాయి. రెండు దశాబ్దాల్లో 2 బిలియన్ డాలర్ల విలువైన సోలార్ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు అదానీ 250 మిలియన్ డాలర్లకు పైగా లంచం ఇచ్చినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. సంబంధిత కంపెనీలు అమెరికాలో పనిచేస్తున్నప్పుడు వారిపై లంచం ఆరోపణలు వస్తే, వాటిపై అభియోగాలు వేసేందుకు అమెరికా చట్టాలు అనుమతిస్తాయి.
READ MORE: Paracetamol: పారాసిటమల్ ట్యాబ్లెట్ అధికంగా వాడుతున్నారా? వాళ్లకు చాలా డేంజర్!
గౌతమ్ అదానీని అమెరికాలో అరెస్ట్ చేస్తారా?
ఒకవేళ గౌతమ్ అదానీ భారత్లో ఉంటే.. అయన్ని అప్పగించాలని అమెరికా ప్రాసిక్యూటర్లు కోరాల్సి ఉంటుంది. భారత న్యాయస్థానాలు భారతీయ చట్టం ప్రకారం.. సంబంధిత అభియోగాలు వర్తిస్తాయో లేదో అంచనా వేస్తాయి. ఏదైనా రాజకీయ లేదా మానవ హక్కుల ఆందోళనలను అంచనా వేస్తాయి. తనపై వచ్చిన అభియోగాలను గౌతమ్ అదానీ సవాలు కూడా చేసుకోవచ్చు. ఫలితంగా అప్పగింతపై విచారణ ఆలస్యమవుతూ ఉంటుంది.