Kurnool Bus Accident: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. అయితే.. ఈ ట్రావెల్స్ బస్సు మూసా పేట్ నుంచి 9.30 కి స్టార్ట్ అయ్యింది. ఆరంఘడ్ చౌరస్తా నుంచి రాత్రి 11గంటల తర్వాత బయలుదేరింది. బస్సులో మొత్తం 40 మంది ఉన్నారు. హైదరాబాద్ నుంచి 30 మంది ప్రయాణికులు బయల్దేరారు. డ్రైవర్, సబ్ డ్రైవర్, క్లీనర్‌తో కలిపి మొత్తం 43 మంది…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్-చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్‌ఎస్, బీజేపీ, ఇతర పార్టీలకు సంబంధించిన పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
వెరీటాస్ సైనిక్ స్కూల్ లో కీచకుడు.. విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసిన తెలుగు టీచర్ కొందరి ఉపాధ్యాయుల తీరు పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి మాయని మచ్చగా మారుతోంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు బోధించి సన్మార్గంలో నడిపించాల్సిన టీచర్స్ తప్పటడుగులు వేస్తున్నారు. తమ ప్రవర్తనతో, చేష్టలతో అపకీర్తి మూటగట్టుకుంటున్నారు. బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, అత్యాచార యత్నాలకు పాల్పడడం వంటివి చేస్తున్నారు. తాజాగా సిద్ధిపేట జిల్లా ములుగు (మం) లక్ష్మక్కపల్లి గ్రామంలోని వెరీటాస్ సైనిక్ స్కూల్ లో కీచక టీచర్ బాగోతం…
Anakapally : అనకాపల్లి జిల్లాలో మళ్లీ వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. 4 రోజుల వ్యవధిలో 2 మృతదేహాలు సంచలనంగా మారాయి. చనిపోయింది ఎవరు? చంపింది ఎవరు? నగర శివారు ప్రాంతాలే ఎందుకు ఎంచుకున్నారు? కలకలం రేపిన ఆడ, మగ ఈ రెండు మృతదేహాలకు ఏమైనా సంబంధం ఉందా? రెండు మృత దేహాలు.. వంద అనుమానాలు.. మిస్టరీ మరణాలు వెనక ఎవరి హస్తం ఉంది. అనకాపల్లి జిల్లాలోని సబ్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా మృతదేహాలు కలకలం…
Fake ED Officers: గుంటూరు జిల్లాలో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) పోలీసులమంటూ నటించిన దుండగులు భారీ దోపిడీ చేశారు. సుమారు రూ. 70 లక్షల నగదుతో పాటు ఒక వ్యక్తిని కూడా తీసుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ తన భర్తను చంపేందుకు తన సోదరులతో కలిసి ప్లాన్ చేసింది. దాదాపుగా మరణం అంచులో ఉన్న సదరు వ్యక్తి ఓ అపరిచిత వ్యక్తి మూలంగా రక్షించబడ్డాడు. ఈ ఘటన రాష్ట్రంలోని బరేలీలో జరిగింది. డాక్టర్ సహాయకుడిగా పనిచేస్తున్న రాజీవ్ అనే వ్యక్తి కాళ్లు, చేతులు విరిగిపోయి, తీవ్రమైన బాధతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Crime: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో దారుణం జరిగింది. అక్కాచెల్లెళ్లు అయిన ఇద్దరు ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యాచారానికి సంబంధించిన వీడియోలు తీసి, ఇద్దర్ని బ్లాక్‌మెయిల్ చేశారు. దీనిపై బాధితుల్లో ఒక మహిళ నిందితుడు ఫర్హాన్ అనే వ్యక్తిపై ఫిర్యాదు చేయడంతో, అతడిని అతడి స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫర్హాన్‌తో పాటు అతడి స్నేహితుడు తనపై, తన సోదరిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఓ ఐస్ ఫ్యాక్టరీ యజమాని తన వర్కర్లపై కర్కషంగా ప్రవర్తించాడు. ఇద్దరు కార్మికులను తీవ్రమైన చిత్రహింసలకు గురిచేశాడు. దొంగతనం చేశారనే అనుమానంతో వారిద్దరికి కరెంట్ షాక్‌లు ఇస్తూ, గోళ్లు ఊడపీకి హింసించాడని శనివారం పోలీసులు తెలిపారు. రాజస్థాన్ భిల్వారా జిల్లాకు చెందిన అభిషేక్ భంబి, వినోద్ భంబి అనే ఇద్దరు బాధితులను ఒక కాంట్రాక్టర్ ద్వారా కోర్బా జిల్లాలోని గుర్జార్ యాజమాన్యంలోని ఒక ఐస్ ఫ్యాక్టరీలో పనిచేయడానికి నియమించుకున్నారు.
సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో మానవత్వాన్ని మంటగలిపే ఘటన చోటుచేసుకుంది. రక్సెల్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైల్లో ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలి తండ్రి రంజన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. కేల్జార్ రైల్వే స్టేషన్ దాటుతున్న సమయంలో రాత్రి రెండు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రంజన్ కుమార్ తన కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో వాష్‌రూమ్‌కు వెళ్లిన తన కూతురిని…