లైకులు, కామెంట్ల కోసం కొందరు ఎన్ని విన్యాసాలు అయినా చేస్తారు. అలాంటి విన్యాసాల వీడియోలు సోషల్ మీడియాలో బోలెడు దొరుకుతాయి. కొందరు స్టంట్స్ చేయబోయి అడ్డంగా బుక్కయిపోవడం కూడా చూశాం. కొందరు స్టంట్స్‌ను అదరగొట్టేస్తారు. మరికొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ముఖ్యంగా ప్రమాదకరమైన ప్రాంతాల్లో సెల్ఫీలు అంటూ స్టంట్స్ అంటూ చేసి ఎంతో మంది ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియో వైరల్‌గా మారింది.
READ MORE: UPI: వామ్మో.. యూపీఐ ద్వారా11 నెల్లో రూ.223 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు..
ఈ సంఘటన శనివారం శ్రీలంకలోని రైలులో జరిగింది. మహిళ చైనాకు చెందిన పర్యాటకురాలిగా గుర్తించారు. ఆమె రైలు బయట రెయిలింగ్ పట్టుకుని వేలాడుతోంది. మరో వ్యక్తి ఆమెను వీడియో తీస్తున్నట్లు వీడియోలో గమనించవచ్చు. ఇంతలో ఆమె తల కొన్ని చెట్ల కొమ్మలకు తగిలి కింద పడిపోతుంది. ఈ భయంకరమైన సంఘటన తర్వాత, వీడియో తీస్తున్న వ్యక్తి తోటి ప్రయాణికులతో జరిగిన విషయాన్ని చెబుతాడు. రైలును ఆపాలని అరుస్తాడు. రైలు తదుపరి స్టేషన్‌లో ఆగుతుంది. కొంతమంది తోటి ప్రయాణికులు మహిళకు సహాయం చేయడానికి ప్రమాద స్థలానికి తిరిగి వస్తారు. ఆ యువతి అదృష్టవశాత్తూ పొదలపై పడి ప్రాణాలతో బయటపడింది. మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వినియోగదారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరూ మహిళపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరోసారి రైళ్లలో ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
READ MORE: Viral Wedding Card: ఆధార్ కార్డు లాంటి పెళ్లి పత్రిక.. ఎప్పుడైన చూశారా?
A Chinese tourist had a heart-stopping moment while traveling on Sri Lanka's coastal railway line. She fell from the train after being struck by a tree branch while trying to record a video.
Fortunately, she landed on a bush, which broke her fall and miraculously left her… pic.twitter.com/GmKnViyC0U
— Daily Sherlock 🇬🇭 🇺🇸 (@dailysherlock0) December 12, 2024