వాటికన్ సిటీ ప్రపంచంలోనే అతి చిన్న సైన్యాన్ని కలిగి ఉంది. ఈ సైన్యాన్ని స్విస్ గార్డ్ అని పిలుస్తారు. ఈ ఆర్మీ సిబ్బందికి లభించే సౌకర్యాలు చదివితే మీరు ఆశ్చర్యపోతారు. వాటికన్ సిటీ ప్రపంచంలోనే అతి చిన్న దేశం. ఇటలీ రాజధాని రోమ్ నగరంలో ఉంది. ఇక్కడ రోమన్ క్యాథలిక్ చర్చి ఉంది. పోప్ ఇక్కడే నివసిస్తున్నారు. వాటికన్ సిటీ చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతి చిన్న దేశం. దాదాపు 100 ఎకరాల్లో…
పల్నాడు జిల్లా యలమంద గ్రామానికి చెందిన ఉల్లంగుల ఏడుకొండలుకు కలెక్టర్ పి.అరుణ్ బాబు ఎయిర్ కంప్రెషర్ అందజేశారు. ఉల్లంగుల ఏడుకొండలు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని, వ్యాపారం చేసుకునేందుకు సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఎం ఆదేశాన్ని.. జిల్లా కలెక్టర్ వెంటనే అమలు చేశారు. బుధవారం ఉదయం ఏడుకొండలు ఇంటిని సందర్శించిన కలెక్టర్ ఎయిర్ కంప్రెషర్ ను అందజేశారు.
నూతన సంవత్సరం వేళ ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో 1995 సీఎంను చూస్తారని చంద్రబాబు అన్నారు. మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడుతూ.. తాను రాజకీయ కక్షలకు పాల్పడనని చెప్పారు. అలాగని.. తప్పు చేసే వాళ్లను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడతానని చెప్పుకొచ్చారు. సెకీ అంశం తనకు లాడ్డూ లాగే అనిపిస్తుందన్నారు.
దేశవ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా న్యూ ఇయర్ అట్టహాసంగా కొనసాగాయి. ప్రజలంతా కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలికారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రజలు డీజేలు, డ్యాన్స్‌లు, విందులతో సందడి చేశారు.
ఆస్ట్రేలియా గడ్డపై తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి చరిత్ర సృష్టించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా.. ఆస్ట్రేలియా-ఇండియా జట్ల మధ్య మెల్‌బోర్న్ లో నాల్గవ టెస్టు మ్యా్చ్ జరుగుతుంది. ఈ క్రమంలో.. 8వ నెంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుత సెంచరీతో ఆదుకున్నాడు. ఆస్ట్రేలియాపై ఎనిమిదో నంబర్‌లో సెంచరీ సాధించిన రెండవ భారతీయ క్రికెటర్ గా నిలిచాడు. కాగా ఆసీస్ ను వారి సొంత గడ్డపైనే దడదడలాడించిన నితీశ్ రెడ్డిపై…
లోక్‌సభ ఎన్నికల అనంతరం ఎన్నికల సంఘం డేటాను విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం.. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల ఓటింగ్ గణాంకాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ఓటరు జాబితాలో తమ పేర్లను చేర్చుకునే సమయంలో వీరిలో చాలా ఉత్సాహం కనిపించిందని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటరు జాబితాలో 1.2 లక్షల మంది తమ పేర్లను చేర్చుకోగా, ఎన్నికల సమయంలో కేవలం 2.48 శాతం మంది మాత్రమే ఓటు వేయడానికి భారతదేశానికి వచ్చారు.
కిచ్చా సుదీప్ కన్నడ స్టార్ హీరో. రాజమౌళి పుణ్యమా అని తెలుగులో కూడా మంచి ఫేమస్ అయ్యాడు. ఈ మధ్య ఆయన చేస్తున్న కన్నడ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ‘విక్రాంత్ రోణ’ తర్వాత కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ పూర్తి స్థాయి హీరోగా నటించిన ‘మ్యాక్స్’ సినిమా కన్నడనాట సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వెర్సటైల్ ఆర్టిస్ట్ వరలక్ష్మీ శరత్ కుమార్, పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన టాలీవుడ్ నటుడు సునీల్ కీలక…
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, స్మారక స్థలానికి సంబంధించి వివాదం ముదురుతోంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రశ్నను లేవనెత్తుతూ.. "ఒక వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు.. అన్ని విభేదాలు కూడా అతనితో అంతం కావాలి.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అభిమానులపై అసహనం వ్యక్తం చేశారు. ఈ రోజు కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించడానికి వెళ్లిన సంగతి తెలిసిందే.
నిమ్స్ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది.. చేయని తప్పుకి ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికున్ని పంజాగుట్ట పోలీసులు చితకబాదారు. ఎమ్మారై స్కానింగ్ కోసం వచ్చిన పేషెంట్ బంగారు గొలుసు పోయిందని కాంట్రాక్టు కార్మికుని కొట్టారు. పేషెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కాంట్రాక్టు కార్మికుల్ని గొలుసు గురించి ప్రశ్నించారు.