కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా.. ఇండియాస్ హైయెస్ట్ ఓపెనింగ్స్‌తో పాటు.. హైయెస్ట్ కలెక్షన్స్‌ను టార్గెట్ చేశారు సుకుమార్, అల్లు అర్జున్. పుష్ప సినిమాకు వచ్చిన క్రేజ్ చూసి.. పుష్ప 2ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకోసం మూడేళ్ల సమయం తీసుకున్నారు. అందుకు తగ్గట్టే.. సాలిడ్ అవుట్ పుట్ వచ్చినట్టుగా చిత్ర యూనిట్ హైప్ ఎక్కించింది. సినిమా రన్ టైం మూడు గంటల 20 నిమిషాలు ఉన్నా సరే.. అరె అప్పుడే అయిపోయిందా? అనేలా ఉంటుంది అని ప్రూవ్…
భవిష్యత్తులో టీఎంసీ బాధ్యతలు చేపట్టనున్న మమతా బెనర్జీ వారసులు ఎవరు? ఈ ప్రశ్న పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తృణమూల్ కాంగ్రెస్ వర్గాలతో పాటు సాధారణ ప్రజల్లో కూడా ఈ ప్రశ్న పదే పదే లేవనెత్తుతోంది. ఇప్పుడు ఈ విషయాన్ని స్వయంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. పార్టీలో సీనియర్ నేతలు, యువకుల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మమతా శుక్రవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు.
కెనడాలో భారతీయులపై దాడులు పెరుగుతున్నాయి. ప్రతిరోజూ భారతీయులను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా భారతీయ విద్యార్థిని హత్య కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సర్నియాలో భారతీయ విద్యార్థిని కత్తితో పొడిచి చంపారు. బాధితుడిని పంజాబ్‌కు చెందిన గురాసిస్ సింగ్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే కొందరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న భారతీయ విద్యార్థిని గుర్తించారు.
నేడు రాజ్యసభలో తీవ్ర దుమారం రేగింది. సభ వాయిదా పడిన తర్వాత నిన్న సాధారణ తనిఖీల్లో భద్రతా అధికారులు ప్రస్తుతం అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన సీటు నంబర్ 222 నుంచి కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారని రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్ తెలిపారు. రూ.500, రూ.100 కరెన్సీ నోట్లు ఉన్న కట్టను గుర్తించినట్లు ధన్‌ఖర్ తెలిపారు. ఆ నోట్ల అసలైనవో.. నకిలీవో స్పష్టత లేదన్నారు. చట్ట ప్రకారం విచారణ జరుగుతుందన్నారు. డబ్బు ఎవరిది అనే కోణంలో…
'చీరలోని గొప్పతనం తెలుసుకో.. చీర కట్టి ఆడతనం పెంచుకో.. సింగారమనే దారంతో చేసింది చీర.. ఆనందమనే రంగులనే అద్దింది చీర.. మమకారమనే మగ్గంపై నేసింది చీర..' అంటూ సినీ గేయ రచయిత చంద్రబోస్ రాసిన పాట చీరలోని అందం.. ఆ చీరతో ఆడపడుచు సౌందర్యాన్ని చక్కగా వర్ణించారు. మరోవైపు.. ‘అమ్మ చీరనే కట్టే పాప జ్ఞాపకం..’ అనేది ఎంత అందమైన భావనో కదా!. కానీ.. ప్రస్తుత సమ పరిస్థితులు చూస్తుంటే.. "ఒకప్పుడు మా అవ్వలు చీరలు కట్టుకునే…
కేరళలోని శబరిమల అయ్యప్ప భక్తులకు పోలీసులు గుడ్‌న్యూస్ చెప్పారు. శబరిమల అయ్యప్ప ఆలయంలో వార్షిక మండలం-మకరవిళక్కు తీర్థయాత్ర నవంబర్ 16 నుంచి ప్రారంభమైంది. 41 రోజుల పాటు సాగే ఈ పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శనం కోసం వస్తున్నారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేరళ పోలీసులు ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించారు. జిల్లా పోలీసు చీఫ్ వి.జి. వినోద్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు సైబర్ సెల్ 'శబరిమల - పోలీస్ గైడ్'…
తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన క్రమంలో సంధ్య థియేటర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్, ఆయన టీం పైన కూడా కేసు నమోదు చేశారు. మధ్య మండల డీసీపీ అక్షాంశ్ యాదవ్ ఈ అంశంపై స్పందించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "నిన్న రాత్రి 9.40 సమయంలో పుష్ప 2 ప్రీమియర్ షో సంధ్య థియేటర్లో ఏర్పాటు చేసుకున్నారు.. సినిమా వీక్షించేందుకు అధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు.. ప్రేక్షకులతోపాటు సినిమాలో…
కాంగ్రెస్ పరిస్థితి గురువింద గింజ సామెత లా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను ఏడాదికాలంగా కాంగ్రెస్ అమలు చేయలేదన్నారు. అబద్ధపు ప్రచారాలతో బాధ్యత రహితంగా పని చేస్తుందని విమర్శించారు. అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఆరు హామీలను పూర్తి అమలు చేస్తామని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు లేఖ రాశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ చతికీల పడిందన్నారు.
ద్రోహి ఇచ్చిన సమాచారంతో డిసెంబర్ 1వ తేదీన ములుగు జిల్లా, ఏటూర్ నాగారం మండలం, చల్చాక గ్రామ పంచాయితీ అడవు పోల్ కమ్మ వాగు వద్ద తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు ఏడుగురి విప్లవకారులకు విషమిచ్చి అతి కిరాతకంగా చంపారని భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆరోపించింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. "నవంబర్ 30వ సాయంత్రం ఏడుగురితో ఉన్న తమ దళం వలస ఆదివాసీ గ్రామాన్ని కలిసి నమ్మిన వ్యక్తికి…
గత కొన్ని సంవత్సరాలుగా.. ఆస్ట్రియన్ మోటార్ సైకిల్ తయారీదారు కేటీఎం భారతదేశంలో ప్రీమియం మోటార్ సైకిల్ విభాగంపై దృష్టి కేంద్రీకరించింది. గణనీయమైన మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. ఆకట్టుకునే డిజైన్లతో కుర్రకారులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.. ఈ కంపెనీకి చెందిన కేటీఎం 250 డ్యూక్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 250cc బైక్స్‌లో ఒకటి.