Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Modi Lashed Out At Congress In Lok Sabha

PM Modi : రాజ్యంగం గురించి నెహ్రూ సీఎంలకు లేఖ రాశారు.. పార్లమెంట్‌లో మోడీ సంచలన వ్యాఖ్యలు

NTV Telugu Twitter
Published Date :December 14, 2024 , 7:02 pm
By RAMAKRISHNA KENCHE
  • పార్లమెంట్‌లో మోడీ ప్రసంగం
  • కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించిన మోడీ
  • పలు ఘటనలు గుర్తు చేసిన ప్రధాని
PM Modi : రాజ్యంగం గురించి నెహ్రూ సీఎంలకు లేఖ రాశారు.. పార్లమెంట్‌లో మోడీ సంచలన వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

నేడు పార్లమెంట్ సమావేశాల్లో 75 ఏళ్లు పూర్తి చేసుకున్న భారత రాజ్యాంగం, రాజ్యాంగ ప్రయాణంపై చర్చ జరిగింది. డిసెంబరు 13 నుంచి లోక్‌సభలో రాజ్యాంగంపై రెండు రోజుల చర్చను ఏర్పాటు చేశారు. ప్రతిపక్ష ఎంపీల ప్రసంగాల అనంతరం ప్రధాని మోడీ పార్లమెంట్‌లో ప్రసంగించారు. ప్రసంగం మధ్యలో కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం రాజ్యాంగం ఏర్పడి 25 ఏళ్లు పూర్తవుతున్న వేళ రాజ్యాంగాన్ని లాక్కున్నారన్నారు. దేశాన్ని జైలుగా మార్చి పౌరుల హక్కులను కాలరాశారన్నారు. ఇది కాంగ్రెస్ చరిత్రలో ఎప్పటికీ కడుక్కోలేని పాపమని అన్నారు. రాజ్యాంగ నిర్మాతల తపస్సును, శ్రమను నాశనం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. 1951లో కాంగ్రెస్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాజ్యాంగాన్ని మార్చిందని, భావప్రకటనా స్వేచ్ఛపై దాడి చేసిందని అన్నారు.

READ MORE: Atrocious Incident: యువతిపై కౌన్సిలర్ అల్లుడు అత్యాచారయత్నం.. ఆమె కుటుంబంపై కత్తులతో దాడి

కాంగ్రెస్ రాజ్యాంగాన్ని తారుమారు చేసిందని, రాజ్యాంగంలోని ప్రాథమిక స్ఫూర్తిని విస్మరించిందని ప్రధాని అన్నారు. రాజ్యాంగ పరిషత్‌లో చేయలేని పనిని వెనుక నుంచి చేశారన్నారు. రాజ్యాంగం మనకు అడ్డం వస్తే.. ఎలాగైనా మార్చాలని పండిట్ నెహ్రూ ముఖ్యమంత్రులకు లేఖ రాశారని మోడీ అన్నారు. 55 ఏళ్లు ఒకే కుటుంబం పాలించిందని గుర్తు చేశారు. ఈ కాలంలో రాజ్యాంగంపై నిరంతరం దాడి జరిగిందన్నారు. దుష్ట ఆలోచనలు, చెడు పనులు, చేష్టలతో కూడిన ఈ కుటుంబ సంప్రదాయ దేశాన్ని అనేక ఇబ్బందులకు గురి చేసిందని పేర్కొన్నారు.

READ MORE: Water Society Polls: సాగునీటి సంఘం ఎన్నికల్లో అధికారిపై కత్తితో దాడి.. ఎన్నికలు వాయిదా

“దేశంలో ఒక చోట కరెంటు ఉండేది. కానీ.. అది అక్కడ నుంచి మిగతా ప్రాంతాలకు సరఫరా కాలేదు. వన్ నేషన్, వన్ గ్రిడ్ ఈ సమస్యను పరిష్కరించింది. దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరాను సజావుగా, ప్రభావవంతంగా చేసింది.” అని ప్రధాని మోడీ తెలిపారు. జీఎస్టీ దేశ ఆర్థిక ఐక్యతను పటిష్టం చేసిందని మోడీ ప్రస్తావించారు. ఇది భారతదేశంలో సాధారణ మార్కెట్‌ను సృష్టించింది. ఇది వాణిజ్యం, పరిశ్రమలకు కొత్త ఊపునిచ్చిందన్నారు. డిజిటల్ విప్లవం ద్వారా ప్రతి వ్యక్తికి సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేసినట్లు తెలిపారు. దేశ సమైక్యతకు ఆర్టికల్ 370 అడ్డుగా ఉందని, అందుకే ఆర్టికల్ 370ని సమాధి చేసినట్లు చెప్పారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • LATEST TELUGU NEWS
  • Lok Sabha
  • lok Sabha Winter Sessions
  • Modi lashed out at Congress in Lok Sabha

తాజావార్తలు

  • Nadendla Manohar: ఆదివారాల్లో కూడా రేషన్ షాపులు.. జూన్ 1 నుంచి సరుకులు పంపిణీ!

  • Alleti Maheshwar Reddy : కవిత అసంతృప్తి.. BRS పతనానికి నిదర్శనం

  • Rajnath Singh: ఏదో ఒకరోజు POKను భారత్‌లో కలిపేస్తాం.. రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు..!

  • Vidadala Rajini: చంద్రబాబు.. ఎందుకు ఇలా పట్టి పీడిస్తున్నారు!

  • Raja Singh : కవిత మాట్లాడినది నిజమే.. పెద్ద ప్యాకేజీ దొరుకుతే కలిసిపోతారు..!

ట్రెండింగ్‌

  • Nissan Magnite CNG: నిస్సాన్ మాగ్నైట్‌కు ఇకపై సీఎన్జీ కిట్ కూడా.. కేవలం రూ.74,999 మాత్రమే..!

  • WhatsApp In iPad‌: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPad‌లో కూడా వాట్సాప్..!

  • Motorola Razr 60: రూ. 49,999లకే రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరాతో మడతపెట్టే ఫోన్ను లాంచ్ చేసిన మోటరోలా..!

  • Jade Damarell: ‘ట్రూ లవ్’ అంటే ఇదేనేమో.. ప్రియుడు బ్రేకప్ చెప్పడంతో 10,000 అడుగుల ఎత్తు నుంచి దూకి సూసైడ్..!

  • Motorola Edge 2025: 50MP ఫ్రంట్ కెమెరా, Dimensity 7400 ప్రాసెసర్‌, హై ఎండ్ ఫీచర్లతో మోటరోలా ఎడ్జ్ 2025 లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions