Deputy CM Pawan Kalyan: గత 20 నెలల కూటమి సర్కార్‌లో చేపట్టిన వివరాలు ఇవే.. పవన్ కల్యాణ్ పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు తీసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కీలక శాఖలు తీసుకోవడమే కాదు.. వాటిపై ప్రత్యేక మార్క్ కనిపించేలా పని చేస్తున్నారు.. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా లో పోస్టు చేసి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ గత 20 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టిన ప్రధాన కార్యక్రమాల వివరాలను వెల్లడించారు.
గ్రామీణ రోడ్ల నిర్మాణం:
– రూ.3,200 కోట్లు పెట్టుబడి చేసి 5,000 కి.మీ CC రోడ్ల నిర్మాణం, 866 కి.మీ పూర్తయింది.
– పల్లెపండుగ 2.0 ప్రాజెక్ట్ ద్వారా మరో 8,000 కి.మీ రోడ్ల నిర్మాణ లక్ష్యంగా అడుగులు.
– రూ.2,123 కోట్ల సాస్కీ నిధులతో రోడ్ల నిర్మాణం కోసం చర్యలు ప్రారంభం.
– అడవితల్లి బాట ప్రాజెక్ట్ ద్వారా గిరిజన ప్రాంతాల్లో రూ.1,069 కోట్లతో 1,005 కి.మీ రోడ్లు.
Also Read
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
సర్కారీ ఉద్యోగుల ప్రమోషన్, కార్యాలయాలు:
– 10,000 మంది ఉద్యోగులకు పదోన్నతులు.
– 77 కొత్త DDO కార్యాలయాల ప్రారంభం.
– 77 మంది ZP CEO లకు పదోన్నతులు.
ఇంజనీరింగ్ విభాగం & పెద్ద ప్రాజెక్టులు:
– పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం రూ.9,500 కోట్లతో రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించింది.
– ఇప్పటికే రూ.2,600 కోట్ల విలువైన రోడ్లు పూర్తయి, బిల్లులు చెల్లించబడ్డాయి.
– రూ.5,300 కోట్ల విలువైన రోడ్ల పనులు దశలో ఉన్నాయి.
– త్వరలో రూ.1,600 కోట్ల PMGSY నిధులు విడుదల కానున్నాయి.
మొత్తంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపిన ప్రకారం, ఈ కార్యక్రమాలు గ్రామీణాభివృద్ధి, సర్కారీ ఉద్యోగుల పునర్నిర్మాణం, గ్రామీణ రోడ్ల నిర్మాణం మరియు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి దోహదపడే విధంగా ప్రణాళికకై చేపట్టబడ్డాయని చెప్పారు.
గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan సారథ్యంలో ప్రగతిపథంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ
గత 20 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టిన కార్యక్రమాల వివరాలు
• ₹3,200 కోట్ల నిధులతో 5,000 కిమీ సీసీ రోడ్లు, 866 కి.మీ నిర్మాణం
• పల్లెపండుగ 2.O ద్వారా మరో 8,000 కి.మీ రోడ్ల… pic.twitter.com/h3iXjJlcgD— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) March 7, 2026
తాజావార్తలు
-
IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!