కృష్ణా,గోదావరి నదీ బోర్డుల పరిధిపై కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ ఇవాళ్టి నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటికే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు కృష్ణా బోర్డు లేఖ రాసింది. మొదటి దశలో ఐదు ప్రాజెక్టుల పరిధిలోని 29 కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకోవడానికి అవకాశముందని కేఆర్ఎంబి బోర్డు ఉపసంఘం గుర్తించింది. మిగిలిన చోట్ల రెండు రాష్ట్రాలకు కొన్ని అభ్యంతరాలు ఉండటంతో ప్రస్తుతానికి వీలు కాదని తెలిపింది. ప్రాజెక్టుల వారీగా సిబ్బంది కార్యాలయాలు, యంత్రాలు, పరికరాలు ఇలా సమగ్రంగా ముసాయిదా…
తెలంగాణకు కృష్ణా జలాల్లో వాటా కేటాయించే వరకు గెజిట్ నోటిఫికేషన్ ఆపాలని కోరినట్టు తెలిపారు తెలంగాణ సాగునీటిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్.. జలసౌధలో ఇవాళ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం జరిగింది.. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ అమలుపైనే ప్రధానంగా చర్చ జరిగింది.. ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి…
జలసౌధలో ఈరోజు ఉదయం 11 గంటలకు కేఆర్ఎంబి సమావేశం జరగనుంది. 14 నుంచి గెజిట్ అమలు నేపథ్యంలో బోర్డ్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. కృష్ణ బేసిన్ లోని తెలంగాణ 7 ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ 22 ప్రాజెక్ట్స్ బోర్డ్ పరిధిలోకి వెళ్లనున్నవి. జలవిద్యుత్ ని గెజిట్ ప్రకారం బోర్డు పరిధిలోకి తీసుకురావడం పై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. కృష్ణ పై విద్యుత్ పంపుహౌస్ లను బోర్డ్ పరిధిలోకి ఇవ్వాలని కోరిన ఆంద్రప్రదేశ్… తెలంగాణ విద్యుత్ పేరిట…
జల జగడం విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వార్ నడుస్తూనే ఉంది… ఇప్పుడు, విమర్శలు, ఆరోపణల పర్వం కాస్త ఆగినట్టే కనిపిస్తున్నా.. లేఖలు, ఫిర్యాదుల పరంపర మాత్రం కొనసాగుతూనే ఉంది.. ఇవాళ కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ లేఖ రాసింది. నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాల్వల ప్రవాహ సామర్థ్యాల్లో తేడాను సవరించాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. 1952లో ఆంధ్ర, హైదరబాద్ రాష్ట్రాల మధ్య కుదిరిన అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం నాగార్జునసాగర్…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య కృష్ణా జలాల విషయంలో ఫిర్యాదుల పర్వానికి తెరపడే పరిస్థితి కనిపించడంలేదు.. ఒకరుపై ఒకరు పోటీపడీ మరీ కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదులు చేసుకుంటున్నారు.. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో తెలంగాణ చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిపై మరోసారి కేఆర్‌ఎంబీకి లేఖరాసారు తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ శ్యామలరావు.. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి వల్ల విలువైన నీరు వృథా అవుతోందని కేఆర్ఎంబీకి రాసిన లేఖలో పేర్కొన్న ఆయన.. విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ వాడుకున్న 113…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల విషయంలో ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఒకరిపై ఒకరు మరీ పోటీపడి ఫిర్యాదులు చేసుకుంటున్నారు.. ఒక రాష్ట్రం విధానం.. మరో రాష్ట్రానికి నచ్చడంలేదు.. ఇంకో రాష్ట్రం అవలంభిస్తున్న వైఖరి పక్క రాష్ట్రం జీర్ణించుకోలేని పరిస్థితి వచ్చింది.. తాజాగా, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి మరో లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం.. కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ రాసిన లేఖలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం డ్యామ్…
రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జలజగడం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడంలేదు.. పరస్పర ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఇక, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు… తెలంగాణ ప్రభుత్వం మరోసారి లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు, వాదనను పట్టించుకోవద్దంటూ… తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్‌సీ మురళీధర్… కేఆర్‌ఎంబీకి లేఖ రాశారు. కేఆర్‌ఎంబీకి ఏపీ ప్రభుత్వం రాసిన లేఖపై తన లేఖలో వివరణ ఇచ్చారు. తెలంగాణలో గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు తరలించే చోట… టెలీమెట్రీలు…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలజగడం కొనసాగుతూనే ఉంది.. కేఆర్‌ఎంబీకి, కేంద్రానికి, జలశక్తిశాఖకు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఇలా.. రెండు రాష్ట్రాలు లేఖలు రాస్తూనే ఉన్నాయి.. తాజాగా కృష్ణా నది యాజమాన్య బోర్డుకు మరో లేఖ రాసింది ఏపీ. ఇవాళ, కేఆర్‌ఎంబీకి లేఖ రాశారు ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి… కృష్ణా నదిపై జలాశయాలన్నీ పొంగి పొర్లుతున్నాయి.. గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలివేయాల్సి వస్తోందన్న ఆయన.. వరద నియంత్రణలో భాగంగా ఈ నీటిని ఎగువన శ్రీశైలం జలాశయం…
ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం నడుస్తూనే ఉంది… మూడు ఫిర్యాదులు, ఆరు లేఖలు అన్నచందంగా ఈ ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది.. తాజాగా, మరో కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి మరో లేఖ రాశారు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ.. ఇక, ఈ సారి లేఖలో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే.. సెంట్రల్ వాటర్ కమిషన్ 1981లో బనకచెర్ల వద్ద కేవలం ఒక్క క్రాస్ రెగ్యులేటర్ కు మాత్రమే అనుమతించిందని గుర్తుచేశారు.. ఎస్కేప్ రెగ్యులేటర్ అనేది తరువాతి కాలంలో…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నది జలాల విషయంలో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. పరస్పరం ఫిర్యాదులు, లేఖల పర్వం కొనసాగగా.. గతంలో తెలంగాణ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు.. ఇవాళ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది.. ఏపీ విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి లేకుండా తెలుగు గంగ, వెలిగొండ ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచేందుకు విస్తరణ పనులు చేపట్టిందని ఇటీవల కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేసింది తెలంగాణ ప్రభుత్వం.. అనుమతి లేకుండా…