Uttam Kumar Reddy : కృష్ణా జలాలతో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్రం పర్యావరణ అనుమతులు నిరాకరించడం రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయంగా రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్ రాష్ట్ర నిబంధనలను ఉల్లంఘించి ఆర్.ఎల్.ఐ. సి నిర్మాణం ఏ.పి ప్రభుత్వం చెపట్టిందంటూ కేంద్రం వద్ద తాను పలుమార్లు రాష్ట్రం తరపున వాదనలు వినిపించడంతో పాటు రాష్ట్ర నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా…
Etela Rajender : గవర్నమెంట్ పనుల టెండర్లు తీసుకోవడం అంటే ఉరి వేసుకోవడమే అన్నట్లుగా మారిందని ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయకుంటే ఈ మాత్రం పనులు కూడా కనిపించవన్నారు. సీసీ రోడ్లు, చౌరస్తాలో వెలిగే లైట్లు, స్మశాన వాటికలు, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయి..వీటిపై చర్చకు వస్తారా రండని, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కోసం 25…
KRMB : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన నీటి వివాదాలను పరిష్కరించేందుకు కృష్ణా నదీ నిర్వహణ మండలి (KRMB) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి పంపిణీ, వృధా కాకుండా సరైన వినియోగం, తాగునీటి ప్రాధాన్యత వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాగునీటికి ప్రాధాన్యం – రెండురాష్ట్రాలకు బోర్డు సూచన KRMB రెండు రాష్ట్రాలకు తాగునీటి అవసరాలను అత్యంత ప్రాధాన్యతతో చూడాలని సూచించింది. ప్రజలకు తాగునీరు అందించడమే మొదటి బాధ్యతగా…
KRMB : కృష్ణా నదీ నిర్వహణ మండలి (KRMB) భేటీకి ఆంధ్రప్రదేశ్ హాజరుకాకపోవడం తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్ర అసహనానికి గురిచేసింది. తెలంగాణ అధికారులు ఈ చర్యను KRMB authority పట్ల కనీస గౌరవం లేకపోవడంగా అభివర్ణించారు. గత సమావేశంలో ఆంధ్రప్రదేశ్ 23 టీఎంసీ నీటి పంపిణీకి అంగీకరించినప్పటికీ, తాజా భేటీకి హాజరుకాకపోవడంలో ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు KRMBపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఏపీ ప్రభుత్వం తన హాజరును నిర్లక్ష్యం చేయడం ఆమోదయోగ్యం…
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల విషయంలో వ్యవహారాలను చక్కబెట్టేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. బోర్డు ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలోకి కేఆర్ఎంబీ వెళ్లిపోయింది.
బీఆర్ఎస్ పార్టీ నేతలంతా నల్గొండ సభకు వెళ్తున్నామని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. కృష్ణ నది కింద ఉన్న ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించటం మంచిది కాదు అని చెప్పారు.
TS Assembly KRMB Issue: కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ బోర్డుకు అప్పగించరాదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఉమ్మడి రాష్ట్రం కంటే తెలంగాణకే ఎక్కువ నష్టం వాటిల్లిందని ఆరోపించారు.
దక్షిణ తెలంగాణ లీడర్లతో బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ముగిసింది. ఈ సంద్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఈనెల 13 న నల్లగొండ లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు… నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల నుంచి ప్రజలు తరలించాలని పార్టీ నేతలకు సూచించారు. ఇదంతా పాలకులకు ప్రాజెక్ట్ లు, నీళ్ళ గురించి అవగాహన లేకపోవడం తో కేంద్రం గేమ్ స్టార్ట్ చేసిందని ఆయన అన్నారు. ప్రాజెక్ట్ లు ఆధీనం లోకి వెళితే తెలంగాణ…