కేఆర్‌ఎంబీకీ ఆంధ్ర ప్రదేశ్ జలవనరులశాఖ మరోసారి లేఖ రాసింది. కృష్ణా బేసిన్ లోని రిజర్వాయర్ లలో నీటి మట్టం పెరుగుతోందని తెలిపింది. పరివాహక ప్రాంతంలో వర్షాలు పడటంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ కు భారీగా వరద వస్తోందని తెలిపింది. శ్రీశైలం లో నీటి మట్టం 870 అడుగులకు చేరిందని లేఖలో వెల్లడించింది. కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో జలవిద్యుత్ ఉత్పాదనకు అనుమతివ్వాలని కోరింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం నీటి మట్టం పెరిగితే జల విద్యుత్ ఉత్పాదన చేసే…
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు వ్యవహారం ఏపీ, తెలంగాణ మధ్య కాకరేపాయి.. పరస్పరం ఆరోపణలు, విమర్శలు, ఫిర్యాదులు.. ఇలా చాలా వరకే వెళ్లింది వ్యవహారం.. అయితే, విషయంలో కృష్ణా నది యాజమాన్యబోర్డుకు కీలక ఆదేశాలు జారీ చేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ), చెన్నై బెంచ్.. సొంతంగా తనిఖీలు జరిపి నివేదిక ఇవ్వాలని కృష్ణా బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది.. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు తనిఖీలకు ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదన్న కృష్ణా బోర్డు నివేదనను పరిగణలోకి…
కృష్ణా నది జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. మంత్రులు, నేతల మధ్య మాటల యుద్ధం సాగగా… కేంద్ర ప్రభుత్వం గెజిట్లతో వివాదాలకు తెరదింపాలని చూసింది.. కానీ, వాటిపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. మరోవైపు.. కృష్ణా నదీ జలాలను 50:50 నిష్పత్తిలో పంచాలని కోరుతూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డును లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం.. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ ఛీప్ మురళీధర్‌రావు కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు…
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం తారాస్థాయికి చేరి ఫిర్యాదుల వరకు వెళ్లింది.. జల విద్యుత్ ఉత్పత్తి విషయంలో తెలంగాణపై ఏపీ ఫిర్యాదు చేస్తే.. ఆర్డీఎస్ విషయంలో ఏపీపై తెలంగాణ ఫిర్యాదు చేసింది.. అయితే ఇవాళ రెండు రాష్ట్రాలకు కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు లేఖలు రాసింది.. ఇప్పటికే తెలంగాణ చేపడుతున్న విద్యుత్ ఉత్పత్తికి నీటి వినియోగం ఆపాలని తెలంగాణ జెన్కోకు లేఖ రాసిన కేఆర్ఎంబీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల జల విద్యుత్ ప్రాజెక్టుల్లో..…
కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది.. ఆ తర్వాత ఫిర్యాదులు, లేఖలు ఇలా ముందుకు సాగింది.. ఇప్పుడు.. తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు.. ఇప్పటికే కేఆర్‌ఎంబీకి.. ఏపీ నుంచి, తెలంగాణ నుంచి లేఖలు వెళ్లగా.. తెలంగాణ చేపడుతున్న విద్యుత్ ఉత్పత్తికి నీటి వినియోగం ఆపాలని తెలంగాణ జెన్కోకు ఇప్పుడు కేఆర్ఎంబీ లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నీటి విడుదల…
కృష్ణానది యాజమాన్య బోర్డు కమిటీ.. రేపటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల పరిశీలన వాయిదా పడింది… నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాల మేరకు బుధవారం రోజు కేఆర్ఎంబీ కమిటీ రాయలసీమ ప్రాజెక్టు పనులను పరిశీలించాల్సి ఉంది.. అయితే, మంగళవారం సాయంత్రం వరకు ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో… పరిశీలన వాయిదా వేశారు.. ఇక, జూలై 3వ తేదీన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పనుల పరిశీలనకు వెళ్తామని కేంద్ర జలవనరుల శాఖకు సమాచారం ఇచ్చింది…
రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపాలని ఏపీకి కేఆర్ఎంబీ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ఇరిగేషన్ సెక్రటరీకి కేఆర్ఎంబీ లేఖ రాసింది. అందులో డీపీఆర్ సమర్పించి, ఆమోదం పొందే వరకు రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టొద్దని ఏపీకి స్పష్టం చేసిన కృష్ణా బోర్డు… రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపాలంటూ ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలనూ లేఖలో ప్రస్తావించింది కేఆర్ఎంబీ. తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిందన్న అంశాన్ని లేఖలో పేర్కొన్న కేఆర్ఎంబీ… ప్రాజెక్టు సైటులో నిపుణుల బృందం పర్యటనకు ఏపీ సహకరించడం…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదం మళ్లీ రాజుకుంటుంది… ఇరు రాష్ట్రాల మంత్రులు, నేతల మధ్య మాటల తూటాలు పేలుతుండగా.. మరోవైపు ఫిర్యాదుల పర్వం కూడా కొనసాగుతోంది.. తాజాగా.. పర్యావరణ అనుమతులు లేకుండానే కృష్ణనదిపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది తెలంగాణ సర్కార్.. 14.12.2020 నాడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు లేని కారణంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపాలని ఇచ్చిన ఆర్డర్‌ను భేఖాతర్ చేస్తుందని కేఆర్‌ఎంబీకి రాసిన…
రాయలసీమ ఎత్తిపోతల పథకం క్షేత్ర స్థాయి పర్యటనను రద్దు చేసుకోవాలని కేఆర్ఎంబీకి ఏపీ ఇరిగేషన్ కార్యదర్శి శ్యామలరావు లేఖ రాసారు. రాయలసీమ లిఫ్ట్ సీఈ, ఎస్ఈలు కరోనా బారిన పడ్డారని లేఖలో స్పష్టం చేసిన ఇరిగేషన్ సెక్రటరీ… కరోనా కేసులు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పెరుగుతున్నాయని పేర్కొన్నారు శ్యామలరావు. ప్రస్తుత పరిస్థితుల్లో రాయలసీమ లిఫ్ట్ క్షేత్ర స్థాయి పర్యటన సాధ్యం కాదని కేఆర్ఎంబీకి తెలిపారు. సోమ, మంగళవారాల్లో రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించాలనుకున్న కేఆర్ఎంబీకి ఇంకా పరిధిని…