కేఆర్ఎంబీకి ఏపీ మరోలేఖ.. వారికి జరిమానా విధించాల్సిందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య కృష్ణా జలాల విషయంలో ఫిర్యాదుల పర్వానికి తెరపడే పరిస్థితి కనిపించడంలేదు.. ఒకరుపై ఒకరు పోటీపడీ మరీ కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదులు చేసుకుంటున్నారు.. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో తెలంగాణ చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిపై మరోసారి కేఆర్‌ఎంబీకి లేఖరాసారు తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ శ్యామలరావు.. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి వల్ల విలువైన నీరు వృథా అవుతోందని కేఆర్ఎంబీకి రాసిన లేఖలో పేర్కొన్న ఆయన.. విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ వాడుకున్న 113 టీఎంసీల నీటిని ఆ రాష్ట్ర వాటాలో వేయాలని కోరారు.. ఇక, సెప్టెంబర్ 1 తేదీన జలసౌధలో జరిగిన 14 బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను, ఒప్పందాలను తెలంగాణ ఉల్లంఘిస్తోందని ఫిర్యాదు చేసింది ఏపీ… విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా ఏ రాష్ట్రమైన నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొంది.. నిబంధనలు ఏక పక్షంగా ఉల్లంఘిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి జరిమానా వేయాలని కేఆర్‌ఎంబీని కోరింది.. తెలంగాణ వాడుకున్న 113 టీఎంసీలను ఆ రాష్ట్ర నీటి వాటా 299 టీఎంసీల్లో భాగంగా పరిగణించాలని కేఆర్‌ఎంబీకి విజ్ఞప్తి చేసింది ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ.
Also Read
తాజావార్తలు
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
-
EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
ట్రెండింగ్
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!