కృష్ణా బోర్డు సమావేశాన్ని తెలంగాణ అధికారులు వాకౌట్ చేశారు. విద్యుత్ ఉత్పత్తి పై ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య భిన్నాభి ప్రాయాలు వచ్చినట్లు సమాచారాం అందుతోంది. కెఆర్ఎంబి సమావేశంలో జలాల పంపిణీ పై ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల అధికారుల మధ్య సయోధ్య కుదరలేదు. దీంతో తెలంగాణ అధికారులు వాకౌట్ చేశారు. 50; 50 అంటూ తెలంగాణ పట్టు పట్టగా… 70; 30 కావాలని ఏపీ ప్రభుత్వం తమ వాదనను వినిపించింది. సాగు, తాగునీటి అవసరం ఉన్నపుడు…
ఈరోజు ఉదయం11 గంటలకు కృష్ణానది యాజమాన్య బోర్డ్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ స్పెషల్ సీఎస్ లు, ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్లు, కేఆర్ఎంబీ అధికారులు పాల్గొననున్నారు. మొత్తం 13 అంశాల ఎజెండాగా బోర్డ్ సమావేశం జరగనుంది. ఇరు రాష్ట్రాలకు కృష్ణ బేసిన్ లో నీటి కేటాయింపు, బోర్డుల పరిధి, బోర్డ్ తరలింపు ఇతర అంశాలపై చర్చించనున్నారు కేఆర్ఎంబీ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణ పనులు, పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ పనుల అంశాన్ని…
హైదరాబాదులోని జలసౌధలో రేపు ఉదయం 11 గంటలకు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం జరుగనుంది. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై ఏపీ, తెలంగాణా రాష్ట్రాల అభిప్రాయాలు, అభ్యంతరాలపై సమావేశంలో చర్చించనున్నారు. కేఆర్ఎంబీ పరిధి, సిబ్బంది కేటాయింపు, ప్రధాన కార్యాలయం హైదరాబాద్ నుంచి విశాఖ తరలింపు అంశాలపై సమావేశంలో చర్చ జరుగనుంది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పది కోట్ల చొప్పున డిపాజిట్ చేయాలని ఇప్పటికే స్పష్టం చేసింది కేంద్రం.…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఏపీపై తెలంగాణ… తెలంగాణపై ఏపీ.. ఇలా ఫిర్యాదుల పర్వానికి ఇప్పట్లో తెరపడేలా కనిపించడంలేదు.. తాజాగా కృష్ణా నది యాజమాన్య బోర్డు మెంబర్ సెక్రటరీకి లేఖ రాశారు ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణరెడ్డి.. సాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ ఇండెంట్ లేకుండా తెలంగాణ చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిని నిలువరించాలంటూ కేఆర్ఎంబీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. శ్రీశైలం , నాగార్జున సాగర్ ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్నందున కేఆర్ఎంబీ అనుమతితో…
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది.. ఫిర్యాదులు, లేఖలు నడుస్తూనే ఉన్నాయి.. తాజాగా కేఆర్‌ఎంబీ చైర్మన్ కు మరోలేఖ రాసింది తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ… బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం మాత్రమే.. దాని నుండి కృష్ణా బేసిన్ ఆవలకు నీటి మల్లింపును ట్రిబ్యునల్ అనుమతించలేదని.. హెచ్‌ఎన్‌ఎస్ఎస్ ప్రాజెక్టు నుండి బేసిన్ ఆవలకి నీటి తరలింపు వల్ల బేసిన్ లోని తెలంగాణ ప్రాజెక్టులు నష్టపోతాయని కేఆర్‌ఎంబీ దృష్టికి తీసుకెళ్లారు.. నది ఒడ్డున ఉన్న…
సెప్టెంబర్ 1న జరగబోయే కేఆర్‌ఎంబీ సమావేశానికి తెలంగాణ హాజరు కావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సమావేశంలో తెలంగాణకు కృష్ణాజలాల్లో దక్కాల్సిన న్యాయమైన వాటాకోసం బలమైన వాదనలు వినిపించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. అనుసరించాల్సిన వ్యూహం పై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేఆర్ఎంబీ సమావేశంలో చర్చకురాబోయే ఎజెండా అంశాలపై ప్రగతి భవన్ లో ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో… సీఎస్ సోమేశ్ కుమార్, ఇరిగేషన్…
70:30 నిష్పత్తిలోనే కృష్ణా జలాల పంపకం జరగాలని కేఆర్ఎంబీకి ఏపీ లేఖ రాసింది. కృష్ణా జల వివాదాల రెండో ట్రైబ్యునల్ ఆదేశాల ప్రకారం 2021-22 నీటి సంవత్సరానికి ఏపీకి 70 శాతం.. తెలంగాణకు 30 శాతం మేర నీటి పంపకం చేయాలని కేఆర్ఎంబీకి ఏపీ సూచించింది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి పంపకాలను ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయలేదని లేఖలో స్పష్టం చేసింది ఏపీ. ఉమ్మడి ఏపీలో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి చెన్నైకి, హైదరబాద్ నగరానికి…
రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు ధృవీకరించింది కేఆర్ఎంబీ. రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఎన్జీటీకి నివేదిక సమర్పించిన కేఆర్ఎంబీ.. డీపీఆర్ కు అవసరమైన పనులకన్నా అధికంగా పనులు జరిగినట్లు నివేదికలో నిర్ధారించింది. ఎన్జీటీ తీర్పును ధిక్కరించినట్లు ధృవీకరించిన కేఆర్ఎంబీ.. పంప్ హౌస్, అప్రోచ్ ఛానల్, ఫోర్ బే, డెలివరీ మెయిన్ ఛానల్, డెలివరీ సిస్టమ్, లింక్ కెనాల్ పనులు జరిగినట్లు నిర్థారించింది. రెండ్రోజులపాటు ప్రాజెక్ట్ పనులను తనిఖీ చేసిన కేఆర్ఎంబీ అధికారులు… ప్రాజెక్టులో…
కేఆర్ఎంబి అధికారుల వ్యవహార శైలి మరోసారి వివాదాస్పదం అయ్యింది. ప్రాజెక్టుల పనుల పరిశీలన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపై తెలంగాణ ఇరిగేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఫిర్యాదు ఆధారంగా ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాల తర్వాత చాలా ఆలస్యంగా కేఆర్‌ఎంబీ బృందం రాయలసీమ ఎత్తిపోతల పనులను పరిశీలించిందని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ కేఆర్ఎంబి చైర్మన్ కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. తాము ఫిర్యాదు దారులమైనందున తమ ప్రతినిధులను కూడా బృందం…
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య జలజగడం కొనసాగుతూనే ఉంది.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు తాజాగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించింది కృష్ణానది యాజమాన్య బోర్డు బృందం… త్వరలోనే ఎన్జీటీ, కేంద్రానికి దీనిపై నివేదిక సమర్పించనున్నారు.. మరోవైపు.. లేఖలు, ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది… ఇశాళ కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు లేఖరాశారు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ సి. మురళీధర్… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి లేకుండా నిర్మించిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఆపాలని లేఖలో పేర్కొన్నారు మురళీధర్.. మరి తెలంగాణ…