రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జలజగడం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడంలేదు.. పరస్పర ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఇక, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు… తెలంగాణ ప్రభుత్వం మరోసారి లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు, వాదనను పట్టించుకోవద్దంటూ… తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్‌సీ మురళీధర్… కేఆర్‌ఎంబీకి లేఖ రాశారు. కేఆర్‌ఎంబీకి ఏపీ ప్రభుత్వం రాసిన లేఖపై తన లేఖలో వివరణ ఇచ్చారు. తెలంగాణలో గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు తరలించే చోట… టెలీమెట్రీలు ఏర్పాటు చేయాలని గతంలో ఏపీ ప్రభుత్వం కోరిందని లేఖలో తెలిపారు. తక్కువ నీటి మళ్లింపునకు టెలిమెట్రీలు అవసరం లేదని కేఆర్‌ఎంబీకీ చెప్పారు ఈఎన్‌సీ మురళీధర్.