హరీశ్ రావు లాగా పెట్రోల్ ముందు పోసుకున్నట్లు నటించి వేరే వాళ్ల చావుకు కారణం కాలేదని, పోసుకుని చచ్చిపోతా అని నాటకాలు ఆడలేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో కూడా వాళ్ళు అందరూ బ్లాక్ మైలర్స్ గా ఉన్నారని, ఆ బ్లాక్ మెయిల్ వివరాలు కూడా బయట పెట్టాల్సి వస్తదన్నారు. తెలంగాణ రావడానికి మూల కారణం… ఆల్ పార్టీ లో కేంద్రాన్ని ఒప్పించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే. అవిషయం…
రేవంత్ రెడ్డి మితి మీరిన అహంకారంతో మాట్లాడారని, వితండ వాదం చేశారని మండిపడ్డారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీచమైన పద్ధతి లో కేసీఅర్ పై వ్యక్తిగత దూషణలు చేశారు రేవంత్ అని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం మేము KRMBకి ప్రాజెక్ట్ లు అప్పజెప్పామని రంకెలు వేస్తుందని, KRMB మీటింగ్ లో ప్రాజెక్ట్ లు అప్పగించేందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుందన్నారు హరీష్ రావు. రెండు…
ఏపీ ప్రభుత్వానికి కేఆర్‌ఎంబీ లేఖ రాసింది. వెంటనే సాగర్ ఉద్రిక్తతకు తెరదించాలని లేఖలో విజ్ఞప్తి చేసింది. సాగర్ డ్యామ్ నుంచి నీటి విడుదల విషయంలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.. అయితే వెంటనే నీరు తీసుకోవడం ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని కేఆర్ఎంబీ ఆదేశించింది. ఏపీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం తమకు పిర్యాదు చేసిందని కేఆర్ఎంబీ లేఖలో పేర్కొంది. ఏపీ సాగు నీరు కావాలని తమను కోరలేదని లేఖలో కేఆర్‌ఎంబీ స్పష్టం చేసింది.
కృష్ణా జలాల్లో నీటి వాటాలను తేల్చకుండానే కేఆర్‌ఎంబీ సమావేశం ముగిసింది. నదీ జలాల కేటాయింపు న్యాయబద్ధంగా జరగాలని తెలంగాణ వాదిస్తే.. 66:34 నిష్పత్తిలో ఉండాలని ఏపీ వాదిస్తోంది. ఇదిలా ఉండగా.. కేంద్రం తొమ్మిదేళ్ల నుంచి నీటి వాటాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని తెలంగాణ ఆరోపిస్తోంది.
కృష్ణాజలాల గురించి చాలా కాలంగా సమస్యలు ఉన్నాయి. నీటి వినియోగానికి సంబంధించి వాస్తవంగా దక్కాల్సిన వాటా తమకు దక్కడం లేదని తెలంగాణ రాష్ట్రం వెల్లడించింది. ఈ క్రమంలోనే ఈ ఏడాదికి సంబంధించి కృష్నా జలాల వాడకం పై కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ముందు పలు డిమాండ్‌లను ఉంచింది.
Palamuru Rangareddy Lift Irrigation Project: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకుంటూనే ఉన్నారు.. ఇప్పుడు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ ఈఎన్సీ… పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు డీపీఆర్ ఇవ్వాలని లేఖలో కేఆర్ఎంబీని కోరింది… విభజన చట్టానికి వ్యతిరేకంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానం జరుగుతోందని ఆక్షేపించింది.. కృష్ణా బేసిన్‌లో తెలంగాణ…
అనుమతులు లేకుండా ప్రాజెక్టుల పనుల తక్షణమే నిలిపివేయాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు (Krishna River Management Board) తెలుగు రాష్ట్రాలకు లేఖ రాసింది. ఈనేపథ్యంలో.. కేంద్రం గతంలో ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ గడువు పూర్తయిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు లేఖ రాసిన బోర్డు, ఈ విషయాన్ని పేర్కొంది. దీంతో.. ప్రాజెక్టుల అనుమతులకు కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చిన గడువు ఈనెల బుధవారం 13తో ముగిసింది. కాగా.. పనులు నిలిపి వేయాలని స్పష్టం చేస్తూ బోర్డు ఆంధ్రా,…
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడం.. ఆరోపణలు చేయడం, విమర్శలు గుప్పించుకోవడం కొనసాగుతూనే ఉంది.. ఇక, లేఖల పరంపరం ఎప్పుడూ ఆగింది లేదు.. తాజాగా, కేఆర్ఎంబీ చైర్మన్‌కు లేఖ రాశారు తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్… ఈ నీటి సంవత్సరంలో కృష్ణా బేసిన్‌లో 50 : 50 నిష్పత్తిలో నీటి కేటాయింపులు చేయాలని కోరారు.. గత కేఆర్ఎంబీ మీటింగ్ లో తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యతలు చెప్పినప్పటికీ..…
నాగార్జున సాగర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం నీరు విడుదల చేస్తోన్న తెలంగాణ తీరుపై ఏపీ అభ్యంతరం తెలిపింది. విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ చేస్తోన్న నీటి విడుదలను అడ్డుకోవాలని కేఆర్ఎంబీకి లేఖ రాశారు ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణ రెడ్డి. లేఖలో ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ కోరారు. వేసవిలో తాగు నీటి అవసరాలకు లేకుండా విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ నీటిని దుర్వినియోగం చేస్తోంది. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కోసం ముందస్తు అనుమతి లేకుండా నాగార్జునసాగర్…