గత కొంతకాలంగా వాయిదా పడుతూ వచ్చిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనను ఎట్టకేలకు పూర్తి చేసింది కృష్ణానది యాజమాన్య బోర్డు సభ్యుల టీమ్.. కర్నూలు జిల్లాలో పర్యటించిన కేఆర్‌ఎంబీ.. ముచ్చుమర్రి ఎత్తిపోతలను పరిశీలించిన తర్వాత పోతిరెడ్డిపాడు సమీపంలోని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా పరిశీలించింది. కృష్ణా నది జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును పరిశీలించి నివేదిక సమర్పించాలంటూ.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కేఆర్‌ఎంబీ టీమ్…
అత్యవసర బోర్డు సమావేశానికి సంబంధించి సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు.. హైదరాబాద్ లోని జలసౌధలో జీఆర్ఎంబీకి చెందిన 10వ సమావేశం, కేఆర్ఎంబీకి చెందిన 13వ అత్యవసర సమావేశం నిర్వహించినట్టు ప్రకటించాయి… కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లలోని వివిధ అంశాలను అమలు చేసేందుకు ఈ అత్యవసర సమావేశం నిర్వహించినట్టు వెల్లడించాయి బోర్డులు.. తెలంగాణ రాష్ట్రం నుంచి సభ్యులు ఎవరూ ఈ సమావేశానికి హాజరు కాలేదని వెల్లడించిన గోదావరి, కృష్ణా నదీ…
నేషన్ గ్రీన్ ట్రిబ్యునల్, చెన్నైకి లేఖ రాసింది కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)… రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పరిశీలన నివేదిక సమర్పించేందుకు మరో మూడు వారాలు గడువును ఇవ్వాల్సిందిగా.. ఎన్జీటీని కోరారు బోర్డ్ మెంబెర్ సెక్రటరీ రాయపురే.. కాగా, గత వారం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు పరిశీలించి నివేదిక సమర్పించాలని కోరినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలతో ఇప్పటికే రెండు, మూడు సార్లు పర్యటన వాయిదా వేశారు. అయితే, ఎన్జీటీ పెట్టిన గడువు త్వరలోనే…
హైదరాబాద్‌లోని జలసౌధాలో ఈ నెల 9వ తేదీన గోదావరి నది యాజమాన్య బోర్డు, కృష్ణా నది యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు రెండు బోర్డుల అధికారులు.. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా ఇరు రాష్ట్రాల ఇరిగేషన్‌శాఖ అధికారులకు లేఖ రాశారారు.. ఈ అత్యవసర సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాల అమలు కార్యాచరణపై చర్చించనున్నట్టు రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది.. అయితే, ఆ వెంటనే గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు…
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించాలన్న ఉద్దేశంతో.. గోదావరి నది యాజమాన్య బోర్డు, కృష్ణా నది యాజమాన్య బోర్డులకు విస్తృత అధికారులు కల్పిస్తూ.. వాటి పరిధిలను నిర్ణయిస్తూ గెజిట్ విడుదల చేసింది కేంద్రం.. అయితే, దీనిపై భిన్నమైన వాదనలే ఉన్నాయి.. ఇక, రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలు పరిష్కారం కాకపోవడం.. ఫిర్యాదుల పర్వం కొనాగుతూనే ఉన్నందున.. ఈ నెల 9న జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ ఉమ్మడి సమావేశం నిర్వహించాలని నిర్ణయించాయి.. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా ఇరు…
రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను తనిఖీ చేసేందుకు కృష్ణా రివర్ బోర్డు బృందం, ఈరోజు తలపెట్టిన పర్యటన అర్ధంతరంగా వాయిదా పడింది. ఈ మేరకు ఏపీ నీటిపారుదల శాఖ కార్యదర్శితోపాటు ఇతర అధికారులకు కేఆర్‌ఎంబీ సభ్యకార్యదర్శి డి.ఎం.రాయిపూరే లేఖ రాశారు. కృష్ణా బోర్డు బృందంలో తెలంగాణ స్థానికత కలిగిన కేంద్ర జలసంఘం అధికారి దేవేందర్‌రావు ఉండటంపై అభ్యంతరం తెలుపుతూ ఏపీ సర్కారు.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ లో పిటిషన్ దాఖలు చేసిన తరుణంలో పర్యటన వాయిదా పడింది.…
కృష్ణానది జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి… ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు.. ఈ నేపథ్యంలో.. కృష్ణానది యాజమాన్యబోర్డు (కేఆర్‌ఎంబీ) రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించాల్సి ఉంది.. అయితే.. ఆ పర్యటన వాయిదా పటినట్టు ప్రకటించింది కేఆర్‌ఎంబీ.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాల నేపథ్యంలో పర్యటన వాయిదా పడిందని అధికారులు వెల్లడించారు. మళ్లీ ఎప్పుడు పరిశీలన చేసేది తర్వాత వెల్లడిస్తామని కేఆర్‌ఎంబీ తెలిపింది. కాగా, ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకున్నా.. రాయలసీమ…
రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రేపు పర్యటించనుంది. ఎత్తిపోతల వద్ద పనులు జరుగుతున్నదీ లేనిదీ తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ బోర్డును ఇప్పటికే ఆదేశించింది. తొలుత తెలంగాణ అక్రమంగా నిర్మిస్తున్న పథకాలను చూసి రావాలని ఆంధ్రప్రదేశ్ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్‌జీటీ ఆదేశాల మేరకు పర్యటించి నివేదిక సమర్పించాలని కేఆర్ఎంబీ నిర్ణయించింది. ఐతే..బోర్డు పూర్తిస్థాయి సమావేశం ఏర్పాటు చేయకుండా నిర్ణయం తీసుకునేందుకు వీల్లేదని ఏపీ అభ్యంతరం…
కృష్ణా నది జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది.. లేఖల పర్వం నడుస్తూనే ఉంది. తాజాగా కేఆర్ఎంబీ చైర్మన్ కు లేఖ రాశారు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్.. 50 : 50 శాతంలో కృష్ణా నీటివాటా కేటాయించాలని కోరిన ఆయన.. ఏపీ ప్రభుత్వం కృష్ణా నీటిని బేసిన్ పరిధి దాటి మళ్లిస్తుందని కేఆర్‌ఎంబీ దృష్టికి తీసుకెళ్లారు.. ఇక, లేఖలోని కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే.. పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపునకు…
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు మరింత ముదురుతున్నాయి. కృష్ణా జలాలపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు పోటాపోటీగా లేఖలు రాస్తున్నాయి. అయితే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణా నది యాజమాన్య బోర్డు లేఖ రాసింది… రాష్ట్రంలో కృష్ణా బేసిన్ పై నిర్మించిన, నిర్మాణం చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు ఇవ్వాలని లేఖలో పేర్కొంది కేఆర్‌ఎంబీ… కాగా, ఇప్పటి వరకు ఒక రాష్ట్రం పై మరో రాష్ట్రం ఆరోపణలు చేస్తూ రాగ……