జలసౌధలో ఈరోజు ఉదయం 11 గంటలకు కేఆర్ఎంబి సమావేశం జరగనుంది. 14 నుంచి గెజిట్ అమలు నేపథ్యంలో బోర్డ్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. కృష్ణ బేసిన్ లోని తెలంగాణ 7 ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ 22 ప్రాజెక్ట్స్ బోర్డ్ పరిధిలోకి వెళ్లనున్నవి. జలవిద్యుత్ ని గెజిట్ ప్రకారం బోర్డు పరిధిలోకి తీసుకురావడం పై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. కృష్ణ పై విద్యుత్ పంపుహౌస్ లను బోర్డ్ పరిధిలోకి ఇవ్వాలని కోరిన ఆంద్రప్రదేశ్… తెలంగాణ విద్యుత్ పేరిట నీటిని శ్రీశైలం నుంచి దిగువకు విడుదల చేస్తుందంటున్నారు. కృష్ణ పై ఉన్న ఉమ్మడి ప్రాజెక్ట్స్ కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకురావాలన్న ఏపీ కోరింది. అయితే గెజిట్ అమలుకి కొంత సమయం కావాలని గతంలో తెలంగాణ కోరింది. అయితే ఈరోజు సమావేశానికి బోర్డ్ చైర్మన్ తో పాటు ఇరు రాష్ట్రల ఉన్నతాధికారులు, ఇరిగేషన్ అధికారులు హాజరుకానున్నారు.