Jos Buttler: టీ20 ప్రపంచకప్ చివరి దశకు చేరుకుంటోంది. మెగా టోర్నీలో ఇంకా రెండు మ్యాచ్‌లు మాత్రమే ఉన్నాయి. గురువారం రెండో సెమీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది. ఇప్పటికే పాకిస్థాన్ ఫైనల్ పోరుకు చేరుకుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఫైనల్లో టీమిండియా, పాకిస్థాన్ తలపడాలని కోరుకుంటున్నారు. అయితే ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ ఈ అంశంపై స్పందించాడు. ఫైనల్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఉండదని.. తాము ఉండనివ్వమని స్పష్టం చేశాడు. రెండో సెమీస్‌లో టీమిండియాను ఓడిస్తామని…
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇంగ్లాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియాను గాయాలు భయపెడుతున్నాయి. ప్రాక్టీస్ సెషన్లో భారత కీలక ఆటగాళ్లు గాయపడ్డారనే వార్తలు క్రికెట్ అభిమానులను కంగారుపెడుతున్నాయి.
T20 World Cup: టీమిండియాతో ఈనెల 10న జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ తలపడనుంది. అయితే భారత్‌తో సెమీ ఫైనల్స్ కోసం సమాయాత్తం అవుతున్న ఇంగ్లండ్‌కు ఊహించని షాక్ తగిలింది. డాషింగ్ బ్యాటర్ డేవిడ్ మలాన్ ఈ మ్యాచ్‌కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం గజ్జల్లో గాయంతో మలాన్ బాధపడుతున్నాడు. నెట్ ప్రాక్టీస్‌కు కూడా దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడుతున్న సమయంలోనే అతను అర్ధాంతరంగా గ్రౌండ్ నుంచి వెళ్లిపోయాడు. 15వ ఓవర్లో బౌండరీ వద్ద…
టీ20 ప్రపంచకప్ సూపర్-12 గ్రూప్‌లో ఐదు మ్యాచ్‌లకు గానూ నాలుగింటిని గెలిచి టీమిండియా సెమీస్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఈ నెల 10న ఇంగ్లండ్ జట్టుతో సెమీస్ ఆడనుంది భారత్.
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో ఈవారం నాకౌట్ మ్యాచ్‌లు జరగబోతున్నాయి. బుధవారం నాడు తొలి సెమీస్‌లో న్యూజిలాండ్, పాకిస్థాన్ తలపడనుండగా.. గురువారం నాడు రెండో సెమీస్‌లో భారత్, ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మేరు సెమీఫైనల్ మ్యాచ్‌లకు సంబంధించిన అఫీషియల్స్ (అంపైర్లు, రిఫరీ) జాబితాను ఐసీసీ ప్రకటించింది. న్యూజిలాండ్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఎరాస్మస్, రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనుండగా రిచర్డ్ కెటిల్‌బరో, మైఖేల్ గాఫ్ థర్డ్, ఫోర్త్ అంపైర్లుగా వ్యవహరిస్తారు. క్రిస్ బ్రాడ్…
Moen Ali: ఇటీవల భారత్-ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ వివాదాస్పదంగా మారింది. మూడో వన్డేలో దీప్తి శర్మ ఇంగ్లండ్ బ్యాటర్ చార్లీ డీన్‌ను నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో మన్కడింగ్ అవుట్ చేయడంతో టీమిండియాకు క్రీడా స్ఫూర్తి లేదంటూ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. తాజాగా ఈ విషయంపై ఇంగ్లండ్ మెన్స్ క్రికెట్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ మాట్లాడాడు. మన్కడింగ్ అవుట్‌ను పూర్తిగా క్రికెట్ చట్టాల నుంచి తీసేసి చట్ట విరుద్ధమని ప్రకటించాలని…
India Vs England: మాంచెస్టర్ వేదికగా ఈరోజు టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది. టీ20 సిరీస్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో వన్డే సిరీస్ ప్రారంభించిన భారత్ తొలి వన్డేలో ఘనవిజయం సాధించింది. అయితే రెండో వన్డేలో షాక్ తగిలింది. 240 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిలపడింది. దాంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. ఆదివారం జరిగే చివరి మ్యాచ్‌లో విజయం సాధించే జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది. దీంతో ఇరు…