ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ భారీ విజయం సొంతం చేసుకోవడంతో పాటు పలు రికార్డులు కూడా నమోదు చేసింది. ఇంగ్లండ్‌పై తొలిసారి పది వికెట్ల తేడాతో, అది కూడా అతి తక్కువ ఓవర్లలోనే విజయం సాధించిన జట్టుగా.. భారత చరిత్రపుటలకెక్కింది. బౌలర్లైన బుమ్రా, షమీలు సైతం తమ ఖాతాలు రికార్డ్స్ వేసుకున్నారు. ఇక బ్యాటింగ్ విషయంలో రోహిత్ శర్మ – శిఖర్ ధావన్ ద్వయం కూడా ఓ అరుదైన ఫీట్ సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన…
భారత పేస్ బౌలర్ మహమ్మద్ షమీ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టిన షమీ.. ఈ సందర్భంగానే 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. దీంతో.. వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్ల మార్క్‌ని అందుకున్న మూడో బౌలర్‌గా చరిత్రపుటలకెక్కాడు. మొత్తం 80 మ్యాచ్‌ల్లో షమీ ఆ ఫీట్‌ని అందుకున్నాడు. అటు ఆఫ్గన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా అవే గణాంకాల్ని నమోదు చేయడంతో.. ఇద్దరూ సంయుక్తంగా మూడో స్థానాన్ని పంచుకుంటున్నారు.…
ద ఒవల్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ కుదిర్చిన స్వల్ప లక్ష్యాన్ని (111) ఒక్క వికెట్ కోల్పోకుండానే భారత్ చేధించింది. ఓపెనర్లుగా వచ్చిన రోహిత్ శర్మ (76*), శిఖర్ ధవన్ (31*).. తొలుత ఆచితూచి ఆడారు. ఆ తర్వాత వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు బాదడంతో.. 18.4 ఓవర్లోనే భారత్ విజయం సాధించింది. ముఖ్యంగా.. కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగిపోయి ఆడాడు. తొలుత టాస్…
నేడు ఓవల్ వేదికగా టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలివన్డే జరగనుంది. ఇటీవల మూడు టీ20ల సిరీస్‌ను కైవసం చేసుకున్న రోహిత్ సేన ఇప్పుడు వన్డే సిరీస్‌ను కూడా చేజిక్కించుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే సోమవారం జరిగిన ఆప్షనల్ ప్రాక్టీసుకు విరాట్ కోహ్లీ హాజరుకాలేదు. దీంతో కోహ్లీ ఇవాళ్టి మ్యాచ్‌లో ఆడతాడా, లేదా అనేదానిపై అస్పష్టత నెలకొంది. కోహ్లీ గజ్జల్లో గాయంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. మూడో టీ20 సందర్భంగా విరాట్‌కు గజ్జల్లో గాయమైంది. ఈ నేపథ్యంలో అతడు…
నాటింగ్‌హామ్ వేదికగా టీమిండియాతో జరిగిన నామమాత్రపు మూడో టీ20లో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 216 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేసింది. ఓ దశలో ఓడిపోతుందని అభిమానులు భావించారు. అయితే భారత శిబిరంలో సూర్యకుమార్ ఆశలు రేకెత్తించాడు. అతడు ఇంగ్లండ్ బౌలర్లను చీల్చి చెండాడి మెరుపు సెంచరీ చేశాడు. 55 బంతుల్లో 14 ఫోర్లు, ఆరు సిక్సర్ల సహాయంతో 117 పరుగులు చేసి…
నాటింగ్ హామ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఓపెనర్లు బట్లర్ (18), జాసన్ రాయ్ (27) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీళ్లిద్దరూ అవుటైనా డేవిడ్ మలన్ (77), లివింగ్‌స్టోన్ (42 నాటౌట్) ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. దీంతో ఇంగ్లండ్ భారీ స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్,…
అంతర్జాతీయ టీ20ల్లో భారత్ ఖాతాలో మరో సిరీస్ చేరింది. శనివారం నాడు ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో 49 పరుగుల తేడాతో ఆతిధ్య జట్టును టీమిండియా మట్టికరిపించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి ఇంగ్లండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన…
బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ (31), పంత్ (26) ఫర్వాలేదనిపించారు. అయితే వాళ్లిద్దరూ అవుటయ్యాక ఇన్నింగ్స్ ఒడిదుడుకులకు లోనైంది. విరాట్ కోహ్లీ (1) మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ (15), హార్డిక్ పాండ్యా (12) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయారు. అయితే దినేష్ కార్తీక్ (12) తో కలిసి ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (29…
బర్మింగ్‌హామ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ టీమ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ టీమిండియ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తోంది. తొలి టీ20లో టాస్ గెలిచిన రోహిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇండియా భారీ స్కోరు చేయడంతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ ఏకంగా నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. ఇషాన్ కిషన్ స్థానంలో విరాట్ కోహ్లీ, దీపక్ హుడా స్థానంలో రిషబ్ పంత్,…
రిషభ్ పంత్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే.. టెస్టుల్లో అదరగొడుతున్నాడు కానీ, పరిమిత ఓవర్లలోనే సరిగ్గా రాణించట్లేదు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో విఫలమైన పంత్.. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో మాత్రం మెరుపులు మెరిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతోనూ, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతోనూ చెలరేగిపోయాడు. ఇలా వేర్వేరు ఫార్మాట్లలో భిన్నంగా రాణిస్తున్న పంత్ ఆటపై తాజాగా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. టెస్టుల్లో యథావిధిగా పంత్ స్థానాన్ని కొనసాగిస్తూనే..…