T20 World Cup: టీమిండియాతో ఈనెల 10న జరిగే రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లండ్ తలపడనుంది. అయితే భారత్‌తో సెమీ ఫైనల్స్ కోసం సమాయాత్తం అవుతున్న ఇంగ్లండ్‌కు ఊహించని షాక్ తగిలింది. డాషింగ్ బ్యాటర్ డేవిడ్ మలాన్ ఈ మ్యాచ్‌కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం గజ్జల్లో గాయంతో మలాన్ బాధపడుతున్నాడు. నెట్ ప్రాక్టీస్‌కు కూడా దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడుతున్న సమయంలోనే అతను అర్ధాంతరంగా గ్రౌండ్ నుంచి వెళ్లిపోయాడు. 15వ ఓవర్‌లో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో గజ్జల్లో నొప్పితో డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్నాడు. అతడి స్థానంలో ఫిల్ సాల్ట్‌ను జట్టులోకి తీసుకోవడం దాదాపుగా ఖాయమైంది. అతడిని నంబర్ 3 స్థానంలో ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్‌కు పంపించనుంది.
Read Also: Wasim Akram: ఆ క్రికెటర్ మనిషి కాదు.. వేరే గ్రహం నుంచి వచ్చిన ఏలియన్
కాగా ఈ సమస్య తీరిపోయిందని భావించేలోగా ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ కూడా ఫిట్‌నెస్ సమస్యలను ఎదుర్కొంటున్నాడు. దీంతో భారత్‌తో సెమీఫైనల్‌లో మార్క్ వుడ్ ఆడేది అనుమానంగా మారింది. ఫిట్‌నెస్ కారణంగా మార్క్ వుడ్ ట్రైనింగ్ సెషన్స్ నుంచి అర్ధాంతరంగా డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్నాడు. మళ్లీ ప్రాక్టీస్‌కు కూడా వెళ్లలేదు. అయితే 100 శాతం ఫిట్‌నెస్‌తో ఉంటేనే మార్క్ వుడ్‌ను సెమీస్‌లో ఆడిస్తామని ఇంగ్లండ్ యాజమాన్యం చెప్తోంది. కాగా టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు మార్క్ వుడ్ 9 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకవేళ మార్క్ వుడ్ దూరమైతే అతడి స్థానంలో ఎవరు ఆడతారో స్పష్టత రావాల్సి ఉంది.