తెలంగాణలో గత 24 గంటల్లో 28,865 శాంపిల్స్ పరీక్షింగా కొత్తగా 494 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 126 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.
దేశవ్యాప్తంగా కాస్త తగ్గుముఖం పట్టినా.. తెలంగాణలో మాత్రం మహమ్మారి కల్లోలం రేపుతోంది. కొవిడ్ కొత్త కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మరోసారి కరోనా కొత్త కేసుల సంఖ్య రెండు వందలు దాటింది. కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 2 వేల మార్క్ దాటింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2 వేల 26 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 19వేల 715 శాంపిల్స్ పరీక్షించగా, 236 మందికి పాజిటివ్ వచ్చింది. ఆదివారం…
ఆరు నెలల పసికందు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు కరోనా టీకా విషయంలో అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 6 నెలల వయసున్న చిన్నారులకూ ఫైజర్, మోడర్నా కంపెనీల కరోనా టీకాలు వేసేందుకు తాజాగా అనుమతిచ్చింది. ఆరు నెలల నుంచి ఐదేళ్ల పిల్లలకు రెండు డోసులు వేయడానికి మోడెర్నాకు, ఆరు నెలల నుంచి నాలుగేళ్ల పిల్లలకు మూడు డోసులు వేసేలా ఫైజర్‌కు అత్యవసర అనుమతులకు శుక్రవారం ఆమోదం లభించింది. . టీకాలు ఎలా ఇవ్వాలన్న దానిపై…
సోనియాగాంధీ ఆరోగ్యంపై కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పోస్ట్ కొవిడ్ సమస్యలతో పాటు ఆమె దిగువ శ్వాసనాళంలో ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారని కాంగ్రెస్ ప్రకటించింది. ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. ఆమెకు వైద్యుల నిరంతర పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని స్పష్టం చేసింది. ఇటీవల కరోనా బారినపడ్డ ఆమె జూన్ 12న ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మరోవైపు సోనియాగాంధీ త్వరగా కోలుకోవాలని…
కరోనాతో వణికిపోతున్న కిమ్ రాజ్యంలో సరికొత్త అంటువ్యాధి వెలుగుచూసింది. కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో సతమతమవుతోన్న ఉత్తరకొరియాను వరుస అంటువ్యాధులు వెంటాడుతున్నాయి. కొవిడ్‌ను కట్టడి చేయలేక చేతులెత్తేసిన సమయంలోనే టైఫాయిడ్, తట్టు, కోరింతదగ్గు వంటివి విస్తృతంగా వ్యాపించినట్లు సమాచారం. ఇదే సమయంలో తాజాగా మరో అంటువ్యాధి ఉత్తర కొరియాను వేధిస్తున్నట్లు అక్కడి అధికారిక మీడియా తెలిపింది. దీంతో రంగంలోకి దిగిన కిమ్ జోంగ్ ఉన్.. వ్యాధి బారినపడిన వారికి తన కుటుంబం కోసం భద్రపరచిన ఔషధాలను అందించే…
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. పెరుగుతున్న కేసులతో ప్రజల్లో ఫోర్త్ వేవ్ భయాందోళనలు నెలకొన్నాయి. ఫిబ్రవరి నుంచి దేశంలో రోజూవారీ కేసుల సంఖ్య కేవలం 3 వేలకు లోపే నమోదు అయ్యేది. తాజాగా గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య పెరగుతోంది. రోజూవారీ కేసులు 7 వేలు, 8 వేలకు పైగా నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీల్లోనే ఎక్కువ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో గడిచిన 24…
దేశంలో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 8,822 మంది వైరస్‌బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 43,245,517కు చేరుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. మరో 15 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 5,24,792కు చేరింది. మంగళవారం 5,718 మంది కొవిడ్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 4,26,67,088కు చేరింది. ఇప్పటివరకు కోలుకున్న వారి శాతం 98.66గా ఉంది. మృతుల శాతం 1.21 శాతంగా ఉంది.…