దేశంలో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. శుక్రవారం 3,44,994 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. 8,329 మంది వైరస్ బారిన పడ్డారు. 10 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం కొవిడ్ నుంచి 4,216 మంది కోలుకున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర, కేరళ, దిల్లీ, కర్ణాటక, హర్యానాలో మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో క్రియాశీల కేసులు 40 వేల మార్కును దాటేశాయి. దేశంలో రికవరీ రేటు 98.69 శాతానికి పడిపోయింది. పాజిటివిటీ రేటు వరుసగా మూడోరోజు రెండు శాతం(2.41 %) పైనే నమోదైంది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.09 శాతం వద్ద ఉంది.
మహారాష్ట్రలో 3,081 మందికి కరోనా సోకగా.. ఒక్క ముంబయిలోనే ఆ సంఖ్య 1,956గా ఉంది. ముంబయిలో కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కేరళలో 2,415, దిల్లీలో 655 మంది వైరస్ బారినపడ్డారు. 2020 ప్రారంభం నుంచి 4.32 కోట్లకు పైగా కొవిడ్ కేసులొచ్చాయి. శుక్రవారం దేశంలో 15.08 లక్షల మంది టీకా తీసుకోగా.. ఇప్పటివరకూ 194.9 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది.