భారత్‌లో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పంజా విసురుతున్నాయి.. వందలకు పరిమితమైన కేసులు.. ఇప్పుడు వేలను దాటేస్తున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 8,084 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,32,30,101కు చేరింది.. ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 4,26,57,335 మంది బాధితులు పూర్తిస్థాయిలో కోలుకోగా.. మహమ్మారి బారినపడి ఇప్పటికే 5,24,771 మంది ప్రాణాలు వదిలారు.. యాక్టివ్ కేసుల సంఖ్య 50 వేలవైపు పరుగులు పెడుతోంది.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 47,995 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.
Read Also: Airtel: గుడ్‌న్యూస్ చెప్పిన ఎయిర్‌టెల్..
ఇక, కోవిడ్ బారినపడి గత 24 గంటల్లో 10 మంది మృతిచెందగా.. 4,592 మంది బాధితులు కోలుకున్నారు.. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 2,946, కేరళలో 4,319, ఢిల్లీలో 735, కర్ణాటకలో 463, హర్యానాలో 304 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. యాక్టివ్ కేసులు 0.11 శాతానికి చేరగా.. రికవరీ రేటు 98.68 శాతానికి, మరణాల శాతం 1.21కి చేరింది.. కాగా, మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి.