దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు ప్రజనలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. త్వరలో కరోనా ఫోర్త్ వేవ్ రాబోతుందా అనే భయాలు వెంటాడుతున్నాయి. గతం కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత మూడు నెలల కాలం నుంచి దేశంలో రోజూ వారీ కేసుల సంఖ్య కేవలం 3 వేల లోపే ఉంటోంది. అయితే గత వారం నుంచి మాత్రం అనూహ్యంగా కేసులు 6 వేలు, 7 వేలకు చేరుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్రల్లో ఎక్కువ గా కేసులు నమోదు అవుతున్నాయి.
తాజాగా కేంద్ర వైద్యారోగ్య సంస్థ ప్రకటించిన గణాంకాల ప్రకారం దేశంలో గడిచిన 24 గంటల్లో 6594 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 50,548కి చేరింది. రోజూవారీ పాజిటివిటీ రేటు 2.05కి తగ్గినట్లు వెల్లడించింది. కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి దేశంలో 4,32,13,900 మందికి కరోనా సోకింది. గడిచిన 24 గంటల్లో 4216 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో 1,94,92,71,111 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. నిన్న ఒక్క రోజే 15,08,406 కరోనా వ్యాక్సినేషన్ వేసింది వైద్యారోగ్యశాఖ
ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ముక్యంగా అమెరికా, బ్రెజిల్ దేశాల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. సోమవారం అమెరికాలో 50 వేలకు పైగా కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు కాగా.. 100 మందికి పైగా మరణించారు. బ్రెజిల్ లో 40 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. 53 మంది మరణించారు. జర్మనీలో 38 వేల మంది మహమ్మారి బారిన పడ్డారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కేసులు, మరణాలు ఉన్న దేశాల్లో అమెరికా మొదటిస్థానంలో ఉంది.