దేశవ్యాప్తంగా కాస్త తగ్గుముఖం పట్టినా.. తెలంగాణలో మాత్రం మహమ్మారి కల్లోలం రేపుతోంది. కొవిడ్ కొత్త కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మరోసారి కరోనా కొత్త కేసుల సంఖ్య రెండు వందలు దాటింది. కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 2 వేల మార్క్ దాటింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2 వేల 26 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 19వేల 715 శాంపిల్స్ పరీక్షించగా, 236 మందికి పాజిటివ్ వచ్చింది.
ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 19,715 కరోనా టెస్టులు చేశారు. పాజిటివ్ కేసుల్లో ఒక్క హైదరాబాద్‌లోనే 180 వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 28, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 13 కేసులు వచ్చాయి. 24 గంటల వ్యవధిలో మరో 122 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో 7 లక్షల 96 వేల 55 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7 లక్షల 89 వేల 918 మంది కోలుకున్నారు. కరోనా వల్ల రాష్ట్రంలో ఇవాళ్టి వరకు 4బవేల 111 మంది మరణించారు.
Srisailam: స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న పీఠాధిపతులు