తెలంగాణపై మరోసారి కరోనా మహమ్మారి పంజా విసురుతోంది.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య నాలుగు వందలు దాటేసింది.. నాలుగు మాసాల తర్వాత నాలుగు వందలు దాటాయి కోవిడ్ కేసులు.. కొత్తగా 403 కరోనా కేసులు నమోదైనట్టు వెల్లడించిన అధికారులు.. కరోనా కేసులు మళ్లీ పెరుగుతోన్న నేపథ్యంలో కీలక సూచనలు చేశారు.
Read Also: ITC Kohinoor Pub : పబ్‌లో రాత్రి ఏం జరిగిందో బయటపెట్టిన విష్ణు..
వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ హెచ్చరించింది.. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోనివారు వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.. ఇక, అవసరం అయితే తప్ప 10 సంవత్సరాలలోపు, 60 ఏళ్ల పైబడిన వారు బయటకు రావొద్దు అని వార్నింగ్ ఇచ్చారు అధికారులు. ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరాన్ని విధిగా పాటించాలని పని ప్రదేశాల్లో వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు శానిటైజర్‌ను వినియోగించాలని సూచించారు.