North Korea: కిమ్ రాజ్యంలో విజృంభిస్తోన్న మరో అంటువ్యాధి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనాతో వణికిపోతున్న కిమ్ రాజ్యంలో సరికొత్త అంటువ్యాధి వెలుగుచూసింది. కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో సతమతమవుతోన్న ఉత్తరకొరియాను వరుస అంటువ్యాధులు వెంటాడుతున్నాయి. కొవిడ్‌ను కట్టడి చేయలేక చేతులెత్తేసిన సమయంలోనే టైఫాయిడ్, తట్టు, కోరింతదగ్గు వంటివి విస్తృతంగా వ్యాపించినట్లు సమాచారం. ఇదే సమయంలో తాజాగా మరో అంటువ్యాధి ఉత్తర కొరియాను వేధిస్తున్నట్లు అక్కడి అధికారిక మీడియా తెలిపింది. దీంతో రంగంలోకి దిగిన కిమ్ జోంగ్ ఉన్.. వ్యాధి బారినపడిన వారికి తన కుటుంబం కోసం భద్రపరచిన ఔషధాలను అందించే కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు వెల్లడించింది. అయితే, తాజాగా వెలుగు చూసిన ఈ అంటువ్యాధి ప్రమాదం ఏ మేరకు ఉందనే విషయంపై మాత్రం స్పష్టత లేదు.
ఉత్తర కొరియాలోని ఆగ్నేయ ప్రాంత నగరమైన హైజూ నగరంలో అంటువ్యాధి కలకలం రేపినట్లు ఉత్తరకొరియా అధికారిక వార్తాసంస్థ కేసీఎన్‌ఏ వెల్లడించింది. ఈ వ్యాధి వల్ల తీవ్రస్థాయిలో జీర్ణాశయ సమస్యలు ఏర్పడుతున్నట్లు తెలిపింది. దీంతో రంగంలోకి దిగిన ఉత్తర కొరియా అధినేత, ఆయన సతీమణి రి సోల్ జూతో కలిసి బాధితులకు ఔషధాలు, సెలైన్ల పంపిణీ మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కూడా కేసీఎన్‌ఏ విడుదల చేసింది. అయితే, ఆ అంటువ్యాధి ఏమిటీ..? ఇప్పటివరకు ఎంతమంది దాని బారినపడ్డారు..? అనే విషయాలు మాత్రం వెల్లడించలేదు. కలుషిత నీరు, ఆహారం వల్ల కలిగే టైఫాయిడ్, కలరా వంటిదే ఈ ‘ఎంటరిక్ ఎపిడమిక్’ అంటువ్యాధి అని కొందరు నిపుణులు చెబుతున్నారు. వ్యాధి సోకిన వారి విసర్జనాలను తాకడం వల్ల కూడా ఇది వ్యాపిస్తుంది. ఇటువంటి అంటువ్యాధులు ఉత్తర కొరియాలో సర్వసాధారణమేనని నిపుణులు పేర్కొంటున్నారు. సరైన నీటి శుద్ధి కేంద్రాలు లేకపోవడం, అధ్వాన్నమైన ప్రజారోగ్య వ్యవస్థ కారణంగా ఎంతోకాలంగా అక్కడ అంటువ్యాధుల ప్రాబల్యం అధికంగా ఉందని వెల్లడిస్తున్నారు.
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
Afghanistan: ఒకప్పుడు ఫేమస్ న్యూస్ యాంకర్.. ఇప్పుడు వీధి వ్యాపారి
గత రెండున్నరేళ్లుగా కరోనా వైరస్ జాడే లేదని చెప్పుకొన్న ఉత్తర కొరియాలో ఇటీవల కొవిడ్ మహమ్మారి విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే, భారీ స్థాయిలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసే స్థాయిలో లేని ఉ.కొరియా.. లక్షల మంది జ్వరాలు, దగ్గు వంటి కొవిడ్ లక్షణాలతో బాధపడ్డారని మాత్రమే తెలిపింది. రెండున్నర కోట్లకుపైగా జనాభా కలిగిన ఉత్తర కొరియాలో దాదాపు 45లక్షల మంది జ్వరాల బారినపడగా.. 75 మంది మరణించినట్లు అక్కడి అధికారిక మీడియానే తెలిపింది.
తాజావార్తలు
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!