Congress interim president Sonia Gandhi tests positive for COVID19: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి కరోనా బారిన పడ్డారు. దీంతో హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఇటీవలే పోస్ట్ కోవిడ్ సమస్యలతో చికిత్స తీసుకున్నారు సోనియాగాంధీ. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతకుముందు జూన్ మొదటివారంలో కరోనా బారిన పడ్డారు సోనియా గాంధీ.
Bihar Chief Minister Nitish Kumar tests positive for COVID19: బీహార్ సీఎం నితీష్ కుమార్ కు మరోసారి కరోనా సోకింది. ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో ఓ సారి కరోనా పాజిటివ్ రాగా.. మళ్లీ తాజాగా కరోనా బారిన పడ్డట్లు సీఎం కార్యాయలం వెల్లడించింది. మంగళవారం తనకు కరోనా సోకినట్లు.. గత రెండు మూడు రోజులుగా తనను సంప్రదించిన వారు, సన్నిహితంగా ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని సీఎం నితీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
కరోనా కట్టడికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ఫస్ట్, సెకండ్ డోస్ వేయించుకున్న వారికి ఇప్పుడు బూస్టర్ డోస్ పంపిణీ చేస్తోంది ప్రభుత్వం.. అయితే, ఫస్ట్, సెకండ్ డోస్‌లతో పోలిస్తే.. బూస్టర్ డోస్ కు స్పందన పెద్దగా లేదనే వాదన కూడా ఉంది.. తెలంగాణ ప్రభుత్వం.. ఇంటి వద్దరే వెళ్లి బూస్టర్ డోస్ వేసేలా ప్లాన్ చేస్తోంది.. కోవిడ్ ఫస్ట్, సెకండ్ డోసుల పంపిణీలోనూ ఇలాంటి చర్యలే తీసుకుంది సర్కార్.. ఇంటి వద్దకు వెళ్లి.. పొలాల్లోకి వెళ్లికూడా…
కరోనా తగ్గుముఖం పడుతోందని ఊపిరి పీల్చుకుంటున్న నగరవాసులకు మళ్లీ కరోనా కలవరపెడుతోంది. భారీ వానలకు మళ్లీ కరోనా కోరలుచాస్తోంది. రోజురోజుకు కొవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మొన్నటి దాకా వందలో ఉన్న కేసులు తాజాగా 700 దాటాయి. భాగ్యనగరంలోని నార్కట్‌పల్లి గురుకుల కళాశాలలో కరోనా కలకలం రేపింది. నల్గొండ జిల్లాలోని విద్యార్థులపై కరోనా పంజా విసురుతోంది. కాగా.. నార్కట్‌పల్లిలోని గురుకుల కళాశాలలో 15 మంది విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. విద్యార్థి తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి…
Increase on GST మజ్జిగ మీద జీఎస్టీ, పాలు మరగబెట్టి పెరుగు తోడుపెడితే జీఎస్టీ. ఇప్పటికే కరోనా, అధిక ద్రవ్యోల్బణంతో సతమతమౌతున్న జనానికి.. పన్నుల మోత తప్పడం లేదు. జీఎస్టీ, డీజిల్ సెస్, లైఫ్ ట్యాక్స్.. పేరేదైనా భారం తప్పడం లేదు. కష్టకాలంలోనూ ఆదాయాలు తగ్గకుండా చూసుకుంటున్న ప్రభుత్వాలు.. అందుకు పన్నులే మార్గమని ఫిక్సౌతున్నాయి. ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టకుండా ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి. అధిక పన్నులతో ఆర్థిక విధ్వంసం తప్పదని నిపుణులు మొత్తుకుంటున్నా.. వినేవాళ్లు ఎవరూ…
కరోనా మహమ్మారి వల్ల ప్రపంచం ఇబ్బందులకు గురవుతోంది. కరోనా తన రూపాన్ని మార్చుకుంటూ కొత్త వేరియంట్లు పుట్టుకువస్తున్నాయి. ఇప్పటికే ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్, ఇక ఓమిక్రాన్ సబ్ వేరియంట్లు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే ఇవి వివిధ వేరియంట్లపై ఎలా పనిచేస్తాయి..ఎంతకాలం రక్షణ ఇస్తాయనే విషయంపై స్పష్టత లేదు. తాజాగా యేల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, యూనివర్సిటీ ఆఫ్ నార్త్…
కరోనా కల్లోలం కారణంగా ప్యాండమిక్ లో జనం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కు అడిక్ట్ అయ్యారు. థియేటర్లు తెరచిన తరువాత కూడా పోలోమని సినిమాలకు వెళ్ళడం లేదు. రెండు, మూడు వారాలు ఆగితే ఎటూ బిగ్ స్క్రీన్ పై రిలీజ్ అయిన సినిమా ఓటీటీల్లోనూ వస్తుంది కదా అని ఉదాసీనత జనంలో ఏర్పడింది. అయితే పాపులర్ స్టార్స్ సినిమాలను థియేటర్లలోనే చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. మౌత్ టాక్ తో ఆకట్టుకున్న చిన్న సినిమాలనూ ఆదరిస్తున్నారు. కానీ, వస్తోన్న…
ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా మహమ్మారి. ఇప్పటికే అనేక దేశాలు దీని వల్ల ఇబ్బందులు పడుతున్నాయి. కరోనా పుణ్యమా పనిచేసే విధానంలో చాలా మార్పులు తీసుకువచ్చింది. ముఖ్యంగా సర్వీస్ సెక్టార్ లో చాలా వరకు ఉద్యోగులు ఇంటి నుంచే వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇప్పటికీ చాలా సాఫ్ట్ వేర్ కంపెనీలు ఈ పద్ధతి ద్వారానే వారి ఉద్యోగులతో పని చేయించుకుంటున్నాయి. వర్క్ ఫ్రం హోం సంస్కృతికి అలవాటు పడిన వారు ఆఫీసులకు వెళ్లేందుకు సుముఖత చూపించడం లేదు.…
కరోనా అంతానికి భారత్ మరో కీలక ముందడుగు వేసింది. నేటి నుంచి దేశవ్యాప్తంగా ఉచితంగా కోవిడ్ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ను ప్రారంభించనుంది. శుక్రవారం నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బూస్టర్ డోసులు ఇవ్వడం ప్రారంభం కానుంది. బుధవారం కేంద్రం ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. 18 ఏళ్లకు పైబడిన వారందరికీ ఉచితంగా బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. జూలై 15 నుంచి 75 రోజుల పాటు ఉచిత బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం…