Corona Vaccine: అమెరికా కీలక నిర్ణయం.. 6 నెలల పసికందులకు కరోనా టీకా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆరు నెలల పసికందు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు కరోనా టీకా విషయంలో అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 6 నెలల వయసున్న చిన్నారులకూ ఫైజర్, మోడర్నా కంపెనీల కరోనా టీకాలు వేసేందుకు తాజాగా అనుమతిచ్చింది. ఆరు నెలల నుంచి ఐదేళ్ల పిల్లలకు రెండు డోసులు వేయడానికి మోడెర్నాకు, ఆరు నెలల నుంచి నాలుగేళ్ల పిల్లలకు మూడు డోసులు వేసేలా ఫైజర్‌కు అత్యవసర అనుమతులకు శుక్రవారం ఆమోదం లభించింది. . టీకాలు ఎలా ఇవ్వాలన్న దానిపై అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ త్వరలో ఓ నిర్ణయం తీసుకోనుంది. పసికందులకు కరోనా టీకా కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారని.. ఈ నిర్ణయంతో ఆరు నెలల చిన్నారులను కరోనా నుంచి రక్షించడంలో వ్యాక్సినేషన్ తోడ్పడుతుందని ఎఫ్‌డీఏ చీఫ్ రాబర్ట్ కలిఫ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇకపై కొవిడ్-19 కారణంగా చిన్న పిల్లలు ఆసుపత్రిలో చేరడం, మరణాలు సంభవించడం వంటి వాటి నుంచి ఇవి పూర్తి రక్షణ కల్పిస్తాయని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.
అమెరికాలో ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్‌లను వేల మంది చిన్నారులపై ప్రయోగాత్మకంగా పరీక్షించారు. పెద్దవారిలో వచ్చిన మాదిరిగానే వారిలోనూ తేలికపాటి దుష్ప్రభావాలు తలెత్తగా… అదేస్థాయిలో యాంటీబాడీలు కూడా ఉత్పత్తి అయ్యాయి. కాగా.. ఆరు నెలల చిన్నారులకు ఇచ్చే టీకా.. పెద్దలకు ఇచ్చే దానిలో పదో వంతు మాత్రమే ఉంటుందని ఫైజర్ గతంలో తెలిపింది. అదేవిధంగా మోడెర్నా రెండు డోసుల టీకా తీసుకున్న వారిలో మెరుగైన రక్షణ లభించిందని.. కొన్ని కేసుల్లో మాత్రమే ఫైజర్ టీకా పూర్తి రక్షణ ఇవ్వలేదని అధ్యయనంలో వెల్లడైంది. ఫైజర్ బూస్టర్ డోస్‌తో పూర్తి రక్షణ లభిస్తుందని నివేదించింది. అందుకోసమే ఫైజర్ బూస్టర్ డోస్‌ను ఇవ్వాల్సిందిగా నిర్ణయించారు.
Also Read
- Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
- Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
- US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
Agnipath Scheme: వాట్సప్ చాటింగ్ లలో అల్లర్లకు ప్లాన్.. పెట్రోల్ బాటిల్ తో.. రావాలంటూ ఆదేశాలు
తాజావార్తలు
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
Sandeep Patil: రోహిత్, కోహ్లీ లేకపోయినా టీమిండియాకు నష్టమేమీ లేదు.. మాజీ సెలెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
ట్రెండింగ్
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!