Covid 19: టెన్షన్ పెడుతోన్న కరోనా.. తెలంగాణలో భారీగా కొత్త కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా మళ్లీ పైకి కదులుతోంది.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెరగడంతో.. దేశంలో రోజువారి కేసుల సంఖ్య భారీగా వెలుగుచూస్తోంది.. ఇక, తెలంగాణలో ఐదు వందలకు చేరువగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 29,084 మంది శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 493 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 219 మంది కోవిడ్ బాధితులు పూర్తి స్థాయిలో కోలుకున్నారు.. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో 3,322 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తన బులెటిన్‌లో పేర్కొంది..
Read Also: Bandi Sanjay: బండి సంజయ్‌కి షాకిచ్చిన పోలీసులు.. రెండు రోజులకే..!
Also Read
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
- IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా కేసులు వెలుగు చూస్తుండగా.. ఆ తర్వాత మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో పెరుగుతోన్న కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.. గత వారం రోజులుగా కోవిడ్ కేసుల మీటర్ క్రమంగా పైకి కదులుతోంది.. ఇక, వరుసగా పెరుగుతోన్న కోవిడ్ కేసులతో అప్రమత్తం అయిన ప్రభుత్వం.. కరోనా నిబంధనలు పాటించాలని.. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని, శానిటైజర్ వాడాలని సూచిస్తోంది.. ఇక, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు, వృద్ధులు అనవసరంగా బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు అధికారులు.
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!