ఐ క్యూ క్రియేషన్స్ పతాకంపై బొడ్డు కోటేశ్వరరావు నిర్మాతగా శివనాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'దోచేవారేవారురా!'. ఈ సినిమా నుంచి తాజాగా 'కల్లాసు అన్ని వర్రీసూ... నువ్వేలే.. నీ బాసూ..' పాటను గుంటూరు మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ మలినేని పెరుమాళ్ళు చేతులు మీదుగా విడుదల చేసారు.
రిషబ్ శెట్టి రూపొందించిన 'కాంతారా' విడుదలై రెండు నెలలు పూర్తి చేసుకుంది. సెప్టెంబరు 30న విడుదలైన ఈ ఫాంటసీ థ్రిల్లర్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో కూడా అందుబాటులో ఉంది. అయినా ఇప్పటికీ థియేటరల్లో చక్కటి వసూళ్ళను సాధిస్తోంది ఈ సినిమా.
ఇండియాలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉంటారు కానీ ఆ స్టార్ హీరోలతో కూడా సూపర్ స్టార్ అనిపించుకున్న ఏకైక హీరో రజినీకాంత్. బ్లాకు అండ్ వైట్ సినిమాల నుంచి ఇప్పటి మోషన్ గ్రాఫిక్స్ వరకూ ప్రతి టెక్నాలజీలో సినిమా చేసిన హీరో రజినీకాంత్ మాత్రమే.
మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మీడియా ప్రత్యేక లేఖను రిలీజ్ చేశారు. తాను ఎప్పుడైనా ఎవరినైనా మోసం చేస్తే, దగా చేస్తే అది నన్ను నమ్మి టికెట్ కొన్ని ప్రేక్షకులను తప్ప తానెవరిని మోసం చేయలేదని పూరి జగన్నాథ్ లేఖలో తెలిపారు.
సహజంగా సినిమాలు శుక్రవారం నాడు విడుదల అవుతాయి. అయితే ఈ వారం మధ్యలో దీపావళి పండగ రావడంతో కొన్ని మూవీస్ రిలీజ్ డేట్స్ ముందుకొచ్చేశాయి. వీకెండ్ లో కాకుండా వారం ప్రారంభంలోనే రెండు సినిమాలు జనం ముందుకు వచ్చాయి.