పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాప్ హిట్ 'ఖుషి' చిత్రాన్ని డిసెంబర్ 31న 2022కి వీడ్కోలు పలుకుతూ, 2023కి సుస్వాగతం చెబుతూ విడుదల చేశారు. పవన్ అభిమానులకు ప్రస్తుతం 'ఖుషి' ఆనందం పంచుతోంది. సరిగా పాతికేళ్ళ క్రితం అంటే 1998లో జనవరి 1వ తేదీనే పవన్ కళ్యాణ్ ఆ యేడాదికి 'సుస్వాగతం' పలుకుతున్నట్టుగా అదే టైటిల్ తో రూపొందిన తన చిత్రాన్ని విడుదల చేశారు.
దాదాపు ఇరవై ఎనిమిదేళ్ళ క్రితం నాజూగ్గా, పొడుగు కాళ్ళతో లేలేత అందాలతో చూపరుల కన్నులు మిరమిట్లు గొలిపేలా సోనాలీ బింద్రే సందడి చేశారు. అప్పట్లో అనేక కమర్షియల్స్ లో సోనాలీ సోయగాలు కుర్రకారుకు బంధాలు వేశాయి. వాటిని మరింత గట్టిగా బిగించేస్తూ సినిమాల్లోనూ మురిపించి, జనాన్ని మైమరిపించేలా చేశారు సోనాలీ.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో న్యూ ఇయర్ గిఫ్ట్ లభించనుంది. ఇప్పటికే 2023 కానుకగా పవన్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ 'ఖుషి' డిసెంబర్ చివరిరోజున జనాన్ని పలకరించింది. 'ఖుషి' చిత్రాన్ని చూడటానికి తెలుగు రాష్ట్రాల్లో పవన్ ఫ్యాన్స్ థియేటర్లకు పరుగులు తీస్తున్నారు.
రాష్ట్రపతి ఇవాల ఉదయం 11.00-12.00 షేక్‌పేటలోని జి.నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మహిళా కళాశాల సందర్శన. విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశం కానున్నారు. సాయంత్రం 5.00-6.00 శంషాబాద్‌లోని శ్రీరామ్‌నగర్‌లో సమైక్యతామూర్తి శ్రీ రామానుజాచార్య విగ్రహ సందర్శించనున్నారు.
అభిమానులు చూసినంత లోతుగా స్టార్ హీరోస్ ను వారి కుటుంబ సభ్యులు కానీ, సన్నిహితులు కానీ చూడలేరన్నది నూటికి నూరు పైసల నిజం! రాబోయే సంక్రాంతి పండుగ నటసింహ నందమూరి బాలకృష్ణకు ప్రత్యేకం అంటున్నారు ఆయన ఫ్యాన్స్.
ఈ సంక్రాంతికి మరోమారు మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే! చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'లోనూ, బాలకృష్ణ 'వీరసింహారెడ్డి'లోనూ బ్రదర్ సెంటిమెంట్ ఉందని తెలుస్తోంది. ఇలా ఈ ఇద్దరు టాప్ స్టార్స్ గతంలోనూ బ్రదర్ సెంటిమెంట్ తో పొంగల్ బరిలోనే ఆకట్టుకున్న సందర్భం 1997లో చోటు చేసుకుంది.
South India Cinema-BookMyShow Report: సౌతిండియా సినిమా లెవల్ ఇప్పుడు పాన్ఇండియా రేంజ్‌ని దాటేసి ప్రపంచ స్థాయికి ఎదిగింది. హాలీవుడ్, బాలీవుడ్‌లను ఓవర్టేక్ చేసేసింది. ఈ మేరకు బుక్‌మైషో రిపోర్ట్ పలు ఉదాహరణలను వెల్లడించింది. ఇందులో ముందుగా కేజీఎఫ్ మూవీ గురించి చెప్పుకోవాలి. యశ్ హీరోగా రూపొందించిన ఈ చలన చిత్రం సంచలనం సృష్టించింది. కేజీఎఫ్ చాప్టర్-2 ప్రపంచవ్యాప్తంగా 12 వందల కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది.
ఓ వైపు మాస్ పల్స్ పట్టేసిన మెగాస్టార్ చిరంజీవి సినిమా, మరోవైపు గాడ్ ఆఫ్ మాసెస్ గా జేజేలు అందుకుంటున్న నటసింహ బాలకృష్ణ చిత్రం... ఇక సంక్రాంతి బరిలో సందడికి కొదువే లేదు అని సినీజనం భావిస్తున్నారు. అయినాసరే, వారి చిత్రాలు రంగంలో ఉన్నా, తాను నిర్మించిన తమిళ చిత్రాన్ని డబ్బింగ్ రూపంలో తెలుగువారి ముందు ఉంచుతున్నారు దిల్ రాజు.
తెలుగునేలపై 'బాలనాగమ్మ కథ' తెలియనివారు అరుదనే చెప్పాలి. ఇప్పటికీ పల్లెటూళ్ళలో మాయలపకీరు వచ్చి బాలనాగమ్మను కుక్కగా మార్చి తీసుకువెళ్ళాడనే కథను చెప్పుకుంటూనే ఉన్నారు. ఎవరైనా మాయ చేసే మాటలు పలికితే, "మాయలపకీరులా ఏం మాటలు నేర్చావురా?" అంటూ ఉంటారు.